ముంబయిలో ఓ బార్ ఉద్యోగిని హత్య కేసులో నిందితుడిని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు మహారాష్ట్రలోని దహిసర్ పోలీసులు. డిసెంబర్ 29న ముంబయిలోని ఓ అద్దె ఇంటిలో రోజినా షేక్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అదే గదిలో ఉన్న మద్యం సీసా, రెండు గ్లాసుల ఆధారంగా నిందితుడు స్వపన్ పరేశ్ రాయ్దాస్ను బంగాల్లో పట్టుకున్నారు.
మద్యం సీసాపై ఉన్న బ్యాచ్ నంబర్ ఆధారం చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ఈ మద్యాన్ని సరఫరా చేసిన దుకాణంలోని సీసీటీవీ కెమెరాల పరిశీలించి రాయ్దాస్ను బంగాల్లోని హావ్డాలో పట్టుకున్నారు.
దొంగతనం కోసం అనుకుంటే..?
గదిలో మొబైల్, డబ్బు, బంగారం చోరీ కావటం వల్ల మొదట దొంగతనం కోసం ఈ హత్య జరిగిందని పోలీసులు భావించారు. అయితే నిందితుడి వాంగ్మూలం ప్రకారం ఇద్దరు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. తన భార్యకు ఈ విషయం గురించి చెబుతానని రోజినా హెచ్చరించిన నేపథ్యంలో రాయ్దాస్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు.