షిరిడీ సాయిబాబా దర్శనం కోసం వెళ్లేవారు భారతీయ సంప్రదాయాలు, నాగరితకు తగిన విధంగా ఉన్న వస్త్రధారణలోనే రావాలని ఆలయ ట్రస్టు సూచించింది. ఆలయ ఆవరణలో పొట్టి దుస్తుల్లో తిరగడాన్ని నిషేధించింది. ఈ నిబంధనను అతిక్రమిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది.
లాక్డౌన్ తర్వాత సాయిబాబా దర్శనానికి చాలా మంది భక్తులు వెళ్తున్నారు. అయితే కొంతమంది భక్తలు టీ-షర్టులు, జీన్స్ వేసుకొని వస్తున్నట్లు గుర్తించింది ట్రస్టు. దీంతో భారతీయ వేషధారణలోనే రావాలనే నియమాన్ని పెట్టింది. కొందరు భక్తుల సూచనలు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్టు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'రైతుల ఆదాయం కిందకు- మోదీ దోస్తుల ఆస్తి పైపైకి'