ETV Bharat / bharat

కర్ణాటక కొత్త స్పీకర్​గా కాగేరీ బాధ్యతలు - Karnataka

కర్ణాటక విధానసభ నూతన సభాపతిగా ఎన్నికయ్యారు భాజపా సీనియర్​ నేత విశ్వేశ్వర్​ హెగ్డే కాగేరీ. స్పీకర్​ పదవికి ఒకే నామినేషన్​ దాఖలైనందున ఎన్నిక ఏకగ్రీవమైంది.

కర్ణాటక నూతన స్పీకర్​గా కాగేరీ బాధ్యతలు
author img

By

Published : Jul 31, 2019, 12:46 PM IST

కన్నడ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా భాజపా సీనియర్‌ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ హెగ్డే కాగేరీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవికి హెగ్డే ఒక్కరి నుంచే నామినేషన్‌ దాఖలైనందున ఆయనకు పోటీ లేకుండా పోయింది. ఇవాళ సభలో అధికారికంగా ప్రకటించిన అనంతరం... బాధ్యతలు స్వీకరించారు.

కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వంలో స్పీకర్‌గా ఉన్న రమేశ్‌ కుమార్‌ అసెంబ్లీలో యడియూరప్ప సర్కార్​ విశ్వాస పరీక్ష అనంతరం.. పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కొత్త స్పీకర్‌ ఎన్నిక అనివార్యమైంది. సభలో భాజపాకు సంపూర్ణ మెజారిటీ ఉన్నందున కాంగ్రెస్‌, జేడీఎస్‌ తమ తరఫున స్పీకర్‌ అభ్యర్థిని ప్రకటించలేదు.

కాగేరీ.. మొదటినుంచి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఏబీవీపీ నాయకుడిగా పనిచేశారు. 1994 నుంచి వరుసగా అంకోలా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికవుతున్నారు. గతంలో మంత్రిగానూ సేవలందించారు కాగేరీ.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.