ETV Bharat / bharat

చైనాలో కరోనా కేసులు 0- ఆ దేశాల్లో మాత్రం టాప్​ గేర్! - corona latest corona news

కరోనా వ్యాప్తి​ ప్రారంభమైన తర్వాత చైనాలో తొలిసారి సున్నా కేసులు నమోదయ్యాయి. లాటిన్​ అమెరికాలో మాత్రం కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇక పాకిస్థాన్​లో ఒక్కరోజే 1,734 మందికి వైరస్​ సోకగా.. మెత్తం 52వేల మంది కరోనా బారిన పడ్డారు. పలు దేశాల్లో లాక్​డౌన్​ ఆంక్షలు సడలించడం వల్ల కొవిడ్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

కరోనా: చైనాలో సున్నా కేసులు.. మరి ఈ  దేశ పరిస్థితి ఏంటి?

author img

By

Published : May 23, 2020, 6:31 PM IST

చైనాలో శనివారం కరోనా కేసులు తొలిసారి సున్నాకు పడిపోయాయి. లాటిన్​ అమెరికాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆసుత్రులన్నీ వైరస్​ బాధితులతో నిండిపోతున్నాయి. బ్రెజిల్​, మెక్సికో దేశాల్లో ఈ వారంలో ఎక్కువ కేసులు, మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జర్మనీలో తిరిగి ప్రారంభించిన చర్చి, రెస్టారెంట్లపై కొవిడ్​​ ప్రభావం చూపింది. ఓ రెస్టారెంట్​కు వెళ్లిన ఏడుగురికి మహమ్మారి సోకింది. కొద్దిరోజుల్లో రంజాన్​ మాసం ముగియనున్న నేపథ్యంలో.. టర్కీ ప్రభుత్వం కట్టుదిట్టమై లాక్​డౌన్​ ఆంక్షలను విధించింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. 53 లక్షల 26,230 మందికి కరోనా సోకింది.

పాక్​లో 50వేలకుపైగా..

పాకిస్థాన్​లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,743 మంది కొవిడ్​ బారిన పడ్డారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52,437 కేసులు నమోదయ్యాయి. మరో 24 మంది మరణించగా.. దేశంలో వైరస్​ మృతుల సంఖ్య 1,101కి చేరింది.

వైరస్​​ నియంత్రణకు జాగ్రత్తలు చేపట్టకపోతే క్రమక్రమంగా కేసులు పెరుగుతూనే ఉంటాయని ప్రజలను హెచ్చరించింది ప్రభుత్వం.

సింగపూర్​లో 642 మంది...

సింగపూర్‌లో శనివారం మరో 642 మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. ఎక్కువగా వసతి గృహాల్లో నివసిస్తున్న విదేశీ కార్మికులు ఈ మహమ్మారి బారిన పడినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 31,068 మంది మహమ్మారి సోకినట్ల పేర్కొన్నారు.

మెత్తం 548 కేసులు..

నేపాల్​లో శనివారం కొత్తగా 41 మందికి కరోనా సోకింది. మరో ఇద్దరు మరణించారు. దేశంలో మెత్తం 548 మంది వైరస్​ ధాటికి మృతి చెందారు.

Virus cases drop to zero in China but surge in Latin America
ప్రపంచదేశాల్లో కరోనా కేసుల వివరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.