జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో నిత్యం తీరిక లేకుండా గడిపే భద్రతా బలగాలకు 'వర్చువల్ సిమ్‌కార్డ్'లు తలనొప్పిగా మారాయి. వీటిని ఉపయోగించుకుని.. లోయలోని ఉగ్రవాద సంస్థలు పాకిస్థానీయులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
పుల్వామా ఘటనతో...
లోయలో ఈ కొత్త సాంకేతికతకు సంబంధించిన ఆనవాళ్లను 2019లోనే గుర్తించారు అధికారులు. పుల్వామా ఉగ్రదాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాది ఉపయోగించిన వర్చువల్ సిమ్‌కార్డులపై దర్యాప్తు చేపట్టారు. అమెరికాకు చెందిన ఓ సర్వీస్ ప్రొవైడర్‌ను వివరాల కోసం అభ్యర్థించారు.
ఇదీ చూడండి:- ఉగ్రకుట్ర భగ్నం- ఇద్దరు ముష్కరులు అరెస్ట్
అనంతరం దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తో పాటు ఇతర భద్రతా సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టాయి. ఒక్క పుల్వామా ఉగ్రదాడిలో 40కిపైగా వర్చువల్ సిమ్‌లను ఉపయోగించినట్టు తేలింది. అయితే ప్రస్తుతం అంతకు మించి సిమ్‌కార్డులు లోయలో ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎందుకు ఈ వర్చువల్ సిమ్?
ఈ తరహా సిమ్‌లను విదేశాల్లో సర్వీస్ ప్రొవైడర్లు అందిస్తాయి. ఈ సాంకేతికతలో.. కంప్యూటర్ ఓ టెలిఫోన్ నెంబర్‌ను సృష్టిస్తుంది. ఈ సిమ్‌ను ఉపయోగించాలనుకునే వారు.. స్మార్ట్‌ఫోన్‌లో సర్వీస్ ప్రొవైడర్‌కు చెందిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటారు. అనంతరం వివిధ సామాజిక మాధ్యమాలతో ఈ నెంబర్‌ను జోడిస్తారు. సర్వీస్‌ను యాక్టివేట్ చేసేందుకు.. ఈ సామాజిక మాధ్యమాలే వెరిఫికేషన్ కోడ్‌ను సృష్టిస్తాయి. అనంతరం స్మార్ట్‌ఫోన్‌కు అందిస్తాయి.
ఇదీ చూడండి:- భారత్‌ను ఎదుర్కొనేందుకు చైనాకు పాక్ సాయం!