ETV Bharat / bharat

బాబా భయం- 300 ఏళ్లుగా హోలీకి దూరం

దేశమంతా హోలీ సంబరాల్లో మునిగి తేలింది. కానీ ఓ గ్రామంలో అసలు హోలీ సందడే లేదు. ఓ బాబా శాపానికి భయపడి 300 ఏళ్లుగా హోలీ పండుగకు దూరమయ్యారు ఆ గ్రామస్థులు. అసలు ఆ బాబా ఎవరు..? ఆ శాపమేంటి?

బాబా భయంతో..300 ఏళ్లుగా హోలీకి దూరం
author img

By

Published : Mar 22, 2019, 8:29 AM IST

బాబా భయంతో..300 ఏళ్లుగా హోలీకి దూరమైన గ్రామం
అది హరియాణాలోని ఉపమండల్ గుహ్లాలోని దుసేర్​పుర్ గ్రామం. హోలీ పండుగ వచ్చిందంటే చాలు. ఆ గ్రామ ప్రజల ముఖాలు చిన్నబుచ్చుకుంటాయి. ఇతర గ్రామాలకు చెందిన వారు ఆనందంతో హోలీలో మునిగి తేలుతుంటే ఆ గ్రామ ప్రజలు హోలీకి ఆమడదూరంగా పరిగెడతారు. అసలు ఏమిటా కథ చూసేద్దాం రండి!

ఈ విషయంపై ఊరిలో రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. 300 ఏళ్ల క్రితం హోలీరోజే ఓ సాధువు దుసేర్​పుర్ గ్రామానికి శాపం పెట్టాడని ఇక్కడ కొంతమంది ప్రజలు విశ్వసిస్తారు. స్నేహీరామ్ అనే సాధువు గ్రామస్థులను ఏదో కోరిక కోరాడని అంటారు. దానికి వారు నిరాకరించడం వల్ల ఆగ్రహానికి గురైన బాబా ఆ రోజే ఆత్మార్పణం చేసుకున్నారన్నది ఓ కథ.

ఈ పండగ నిర్వహించకపోవడానికి మరో కథనమూ ప్రచారంలో ఉంది. హోలీకా రాక్షసి దహనానికి గ్రామస్థులు సర్వం సిద్ధం చేసి ఉంచారు. సమయానికి ముందే కొందరు యువకులు హోలీకా రాక్షసిని దహనం చేయడం ప్రారంభించారట. యువకుల్ని ఆపేందుకు ప్రయత్నించిన స్నేహీరామ్​ బాబాతో వారు హాస్యమాడడం కారణంగా అవమాన భారంతో ఆయనా హోలీకా దహనంలోనే ఆత్మార్పణం చేసుకుని చనిపోయారు.
మంటల్లో కాలుతూ ఇకముందు ఎవరూ ఈ గ్రామంలో హోలీని నిర్వహించకూడదని, ఎవరైనా అందుకు సాహసిస్తే వారికి అనర్థాలు జరుగుతాయని శాపం పెట్టారు. ఆ శాపానికి భయపడి హోలీని నిర్వహించేందుకు ఇప్పటివరకు ఎవరూ సాహసించలేదు.

గ్రామ ప్రజల్లో ఐక్యత లేకపోవడమే హోలీ జరుపుకోకపోవడానికి కారణం. 300 ఏళ్లుగా హోలీని జరుపుకోవడం లేదు. హోలీ రోజు బాబాకు పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు కానీ హోలీని మాత్రం జరుపుకోరు.

-గ్రామస్ధుడు

300 ఏళ్లుగా హోలీ రోజున ఆవులకు మేత, పిల్లలకు ఆహారాన్ని ఈ ఊరిలో ఎవరూ అందించరు. బాబా సమాధి వద్ద దీపం వెలిగించి నమస్కరిస్తారు. అక్కడ ఉంచిన ప్రసాదాన్నే ఆరగిస్తారు. రానున్న సంవత్సరాల్లోనైనా ఈ గ్రామం స్నేహీరామ్ బాబా భయాన్ని వదిలేసి హోలీని జరుపుకుంటుందో లేదో చూడాలి మరి!

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
2100
LONDON_ Colin Farrell, Danny DeVito, Eva Green, Nico Parker and Finley Hobbins expected at the European premiere of 'Dumbo'
NEW YORK_ '13 Reasons Why' star Dylan Minnette and his band Wallows releases their first studio album.
FRIDAY 22 MARCH
0800
LOS ANGELES_ The PaleyFest LA hosts a 10th anniversary reunion for the 'Parks & Recreation' cast
LOS ANGELES_ DJ Khaled talks new album and hosting the Kids Choice Awards
1300
LONDON_ Amber Bain aka The Japanese House chats about working with Bon Iver's producer and The 1975; and asking her ex-girlfriend to star in her video
CELEBRITY EXTRA
LONDON_ 'Rap is like a very braggy sport': English rapper Yungen on the development of hip hop style
NEW YORK_ Fashion designers say celeb support gives them a boost
LOS ANGELES_ 'Miss Bala' star Ismael Cordova: audition nerves 'just never stop'
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
BURBANK, CA._ David Letterman: I stayed on network TV for too long
BONN, GERMANY_ Michael Jackson exhibition goes ahead despite latest sexual abuse allegations
LEAVESDEN, U.K._ 'Harry Potter' studio tour expands with Gringotts Wizarding Bank
LONDON_ 'Shazam!' stars talk superheroes vs. trolls
ARCHIVE_ Ariana Grande, Childish Gambino to headline Lollapalooza
SEOUL_ K-pop star apologizes for 'unforgivable crime'
CELEBRITY EXTRA
LONDON_ English rapper Yungen likes to be 'Comfortable' on stage
NEW YORK_ Comfort is key, according to many designers
LOS ANGELES_ Olivia Newton-John initially 'nervous' about biggest hits, 'Grease' and 'Physical'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.