ETV Bharat / bharat

'విక్రమ్'​కు ఏం కాలేదు.. ఆశలు సజీవమే: ఇస్రో

చంద్రయాన్‌-2కు సంబంధించి మరో పురోగతి లభించింది. నిన్న ల్యాండర్‌ జాడను కనిపెట్టిన ఇస్రో.. నేడు దాని పరిస్థితిని పసిగట్టింది. హార్డ్‌ ల్యాండింగ్‌ కావడం వల్ల ల్యాండర్‌ విక్రమ్‌ ముక్కలైపోయి ఉంటుందని చాలా మంది నిపుణులు భావించారు. కానీ విక్రమ్‌ పరిస్థితి యథాతథంగా ఉందని ఇస్రో అధికారులు ప్రకటించారు.

author img

By

Published : Sep 9, 2019, 5:15 PM IST

Updated : Sep 30, 2019, 12:21 AM IST

'విక్రమ్'​కు ఏం కాలేదు.. ఆశలు సజీవమే: ఇస్రో

ల్యాండర్​ విక్రమ్​తో సంబంధాల పునరుద్ధరణపై ఇస్రో శాస్త్రవేత్తలు విశ్వాసం ప్రకటించారు. నిన్న ల్యాండర్​ జాడ కనిపెట్టిన ఇస్రో... నేడు విక్రమ్​ పరిస్థితిపై పురోగతి సాధించింది. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్​ ఒరిగి ఉంది తప్ప ముక్కలు కాలేదని ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.

‘నిర్దేశిత లక్ష్యానికి అతి దగ్గరగా 'విక్రమ్' హార్డ్‌ ల్యాండ్ అయింది. ఆర్బిటర్‌ పంపిన థర్మల్‌ ఛాయాచిత్రాల ద్వారా గమనించాం. ల్యాండర్‌ సింగిల్‌ పీస్‌గానే ఉంది. ముక్కలు కాలేదు. ల్యాండర్​తో సంబంధాలు ఏర్పరుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం’ - ఇస్రో అధికారులు

ల్యాండర్‌, అందులో ఉన్న రోవర్‌కు చంద్రునిపై ఒక్క రోజు జీవితకాలం ఉంది. చంద్రునిపై ఒక్కరోజు అంటే భూమిపై 14 రోజులుగా లెక్కిస్తారు. ఈ 14 రోజుల్లోగా విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ తెలిపారు. అయితే ఇది అంత సులభం కాదన్నారు. అయినప్పటికీ ఇస్రో అనుభవాన్ని మొత్తం ఉపయోగించి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు శివన్​ వెల్లడించారు.

చంద్రయాన్‌-2 సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో భాగంగా చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తింది. ల్యాండర్‌ విక్రమ్‌ నుంచి ఇస్రో కేంద్రానికి సంకేతాలు నిలిచిపోయాయి.

Chennai, Sep 9 (ANI): Popular Tamil actor-director Rajasekar passed away on Sunday at the age of 62.The actor took his last breath at Porur's Ramachandra Hospital here after being admitted due to unspecified health issues. He garnered fame by playing the role of the grandfather in Praveen Bennett's directorial serial 'Saravanan Meenatchi. 'Not only did he majorly contribute to Tamil cinema, but Rajasekar also helped small-scale associations grow. His last rites were completed on Sunday evening in Chennai.
Last Updated : Sep 30, 2019, 12:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.