సోదర- సహోదరుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరగుతున్నాయి. రాఖీ పండగను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నా- చెల్లెళ్ల అనుబంధం, ఆప్యాయతలకు రాఖీ పండుగ గుర్తుగా నిలుస్తుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. మహిళల గౌరవ మర్యాదలను కాపాడుతామని ప్రతి సోదరుడూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్లకు భారత్ చెక్!