ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: షహీన్​బాగ్ ఘటనపై ఆప్, భాజపా మాటల యుద్ధం

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజులే మిగిలి ఉన్న తరుణంలో అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ, భాజపా మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైంది. షహీన్​బాగ్​లో కాల్పులకు తెగించింది ఆప్​ కార్యకర్తే అని పోలీసులు ధ్రువీకరించిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ-అమిత్​ షా ద్వయాన్ని ఓడించేందుకు దేశరాజధానిని కేజ్రీవాల్ రణరంగంగా​ మారుస్తారా? అని ప్రశ్నించారు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. ఇదే అంశంపై స్పందించిన దీల్లీ సీఎం కేజ్రీవాల్​.. కాల్పులు జరిపిన వ్యక్తికి ఆమ్​ ఆద్మీ​ పార్టీతో సంబంధాలుంటే కఠిన శిక్ష విధించాలని స్పష్టం చేశారు.

kejriwal latest news
షహీన్​బాగ్ ఘటనపై ఆప్, భాజపా మాటల యుద్ధం
author img

By

Published : Feb 5, 2020, 6:02 PM IST

Updated : Feb 29, 2020, 7:13 AM IST

దిల్లీ దంగల్​: షహీన్​బాగ్ ఘటనపై ఆప్, భాజపా మాటల యుద్ధం

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ, భాజపా మధ్య విమర్శలు తీవ్రతరమయ్యాయి. షహీన్​బాగ్ నిరసనల్లో కాల్పులకు పాల్పడిన వ్యక్తికి ఆప్​తో సంబంధాలున్నట్లు విచారణలో తెలిసిందని దిల్లీ పోలీసులు తెలిపిన తర్వాత ఆప్ పై మాటల యుద్ధానికి దిగింది భాజపా. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్​ షా ద్వయాన్ని ఓడించేందుకు దిల్లీని కేజ్రీవాల్​ రణరంగంగా మారుస్తారా? అని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు.

ఈ ఆరోపణలను దిల్లీ సీఎం కేజ్రీవాల్​ ఖండించారు. దిల్లీలో తాను చేసిన అభివృద్ధిని ఓర్వలేకే భాజపా, కాంగ్రెస్​ సహా అన్ని పార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ.. దిల్లీ పోలీసులను ఆప్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయిస్తోందన్నారు. వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు. ఆప్​ పార్టీకి షహీన్​బాగ్ ఘటనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఒకవేళ అలా రుజువైతే అతనికి కఠినశిక్ష విధించాలని స్పష్టం చేశారు.

" మమ్మల్ని విమర్శించడానికి భాజపా వద్ద ఏ కారణం లేదు. దిల్లీలో జరిగిన అభివృద్ధిపై వాళ్లు ఏమీ మాట్లాడలేరు. ఆప్​ను ఓడించడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయి. భాజపా, ఎల్​జేపీ, ఆర్​జేడీ, జేడీఎస్​, కాంగ్రెస్, అకాలీదళ్, బీఎస్​పీ అన్ని పార్టీలకు కేజ్రీవాల్ ఓటమే లక్ష్యం. దిల్లీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయి. వాళ్లు అనుకున్నది జరగలేదు. 200 మంది ఎంపీలు, 70మంది మంత్రులు, 11మంది ముఖ్యమంత్రులు, అమిత్ షా చేసిన వ్యూహాలు ఫలించలేదు. అందుకే దుష్ప్రచారం ప్రారంభించారు. కేజ్రీవాల్ ఉగ్రవాది, విద్రోహి, రావణుడు, దేశద్రోహి అని ఆరోపించారు. అదీ ఫలితాన్నివ్వలేదు. చివరకు దిల్లీ పోలీసులను వినియోగించుకుంటున్నారు. షహీన్​బాగ్​ ఘటనకు మేమే కారణమని ఆరోపిస్తున్నారు. అలా చేసే అధికారం మాకు ఉందా? అలాంటి పని చేస్తామా? "
-అరవింద్ కేజ్రీవాల్, దీల్లీ ముఖ్యమంత్రి.

ZCZC
PRI ESPL NAT NRG
.LUCKNOW DES15
UP-CABINET
UP Cabinet okays proposal to set up 16 cybercrime police stations in state
         Lucknow, Feb 5 (PTI) The Uttar Pradesh Cabinet on Wednesday approved a proposal to set up 16 cybercrime police stations in the state.
         A total of 18 proposals were approved in a Cabinet meeting headed by Chief Minister Yogi Adityanath, government spokesperson Sidharth Nath Singh told reporters here.
         "The cabinet has approved a proposal to establish cybercrime police stations in UP Police's 16 zonal headquarters in Bareilly, Moradabad, Saharanpur, Agra, Aligarh, Kanpur, Jhansi, Prayagraj, Chitrakoot, Gorakhpur, Devipatan, Basti, Varanasi, Azamgarh, Mirzapur and Ayodhya," he said.
         The cabinet also approved a proposal of nominating teachers of the Provisional Medical Service (PMS) cadre based on their abilities as professors and associate professors on deputation in Ayodhya, Basti, Bahraich, Shahjahanpur and Firozabad medical colleges.
         These colleges were established with the help of the central Government.
         The cabinet also approved an amendment to the web media policy, under which websites with 50,000 hits will now get advertisements under the DAVP. PTI ABN
IJT
02051701
NNNN
Last Updated : Feb 29, 2020, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.