లాక్‌డౌన్‌లో నేర్చుకున్న అనుభవాలతో ముందుకెళ్లాల్సిన తరుణం ఆసన్నమయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి చెప్పిన ఆత్మ నిర్భర్‌కు అర్థం విదేశీ వస్తువులు బహిష్కరించమని కాదని.. దేశీయ ఉత్పాదనలను ప్రోత్సహించాలన్నదే ఆశయమని చెప్పారు. కరోనా తెచ్చిన విశ్రాంతి కాలంలో నేర్చుకున్న అంశాలను ఆయన సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. బాగా సడలించిన నిబంధనలతో సోమవారం నుంచి ప్రారంభంకానున్న లాక్‌డౌన్-5ను ఆయన అన్‌లాక్-1గా అభివర్ణించారు.
‘కరోనా కారణంగా చాలా అంశాలపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు వెంకయ్య. శక్తిమంతులమని విర్రవీగి చిన్న వైరస్ ఏం చేస్తుందిలే అని కనీస జాగ్రత్తలు తీసుకోని వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పారు. 'ప్రకృతి ముందు మనమందరం నిమిత్తమాత్రులమేనని తెలిసింది కదా! ప్రకృతితో సహజీవనం సాగించాలి. మనకి దొరకని వస్తువులను ఏ విదేశీ సంస్థ అయినా మన దేశంలోనే ఉత్పత్తి చేస్తే మంచిదేగా? పెట్టుబడులు, పన్నులు, ఉద్యోగాలు, ఉపాధి కూడా ఆత్మనిర్భర్‌లో భాగమని గుర్తించాలి' అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: లాక్‌డౌన్ 5.0లో ఏం చేయవచ్చు? ఏం చెయ్యరాదు?