సంచలనాత్మక వార్తలు ప్రస్తుతం ఒక ట్రెండ్‌గా మారాయని అభిప్రాయపడ్డారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తన దృష్టిలో అవి అర్థరహితమన్నారు. ప్రస్తుతం.. వార్తలు, అభిప్రాయాలు కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వెంకయ్య నాయుడు. గతంలో ఇలా ఉండేది కాదన్నారు.
'జాతీయ పత్రికా దినోత్సవం' సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు వెంకయ్య నాయుడు. వ్యాపారవేత్తలు, రాజకీయ పార్టీల పత్రికలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జర్నలిజం విలువలు తగ్గిపోతున్నాయన్నారు.
"ఒకే అంశంపై రెండు వేరువేరు పత్రికలు చదవండి. విశేష ఆదరణ లభించిందని ఒక పత్రిక చెబుతుంది. లేదు.. ఖాళీ కుర్చీలున్నాయని మరో పత్రిక ఫోటోలు చూపిస్తుంది. ఆ చిత్రాలు సభ ప్రారంభంకాక ముందే తీసుండొచ్చు. ఇదీ ప్రస్తుతమున్న పరిస్థితి. రాజకీయ పార్టీలు తమ సొంతంగా వార్తా పత్రికలు ప్రారంభించడమే దీనికి కారణం. రాజకీయ నేతలూ సొంత ప్రత్రికలను మొదలుపెట్టారు. తమని తాము రక్షించుకోవడానికి వీటిని వినియోగించుకుంటున్నారు. అనేక మంది తమ వ్యాపారాన్ని ప్రచారం చేసుకోవడం కోసం వార్తా ఛానెళ్లను ప్రారంభించారు. ఇది ఎంతో దురుదృష్టకరం. వ్యాపారాన్ని కాపాడుకోవడానికి, మీరు ప్రచారం చేసుకోవడానికి, ప్రత్యర్థులకు ప్రతికూలంగా రాయడానికి పత్రికలను వాడుకుంటున్నారు."
-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
పత్రికలను ప్రారంభించే హక్కు రాజకీయ పార్టీలకు ఉన్నప్పటికీ.. ఇది ఒక పార్టీకి చెందిన పత్రిక అని ప్రజలకు స్పష్టం చేయాలని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:- కళ్ల ముందే మునిగిపోతున్నా కనీసం కాపాడలేదు!