ETV Bharat / bharat

రాజ్యసభ హౌసింగ్​ కాంప్లెక్స్​కు వెంకయ్య శంకుస్థాపన

రాజ్యసభ ఉద్యోగుల హౌసింగ్​ కాంప్లెక్స్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 17 ఏళ్లు జాప్యం జరగటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Venkaiah Naidu lays foundation stone
రాజ్యసభ హౌసింగ్​ కాంప్లెక్​కు వెంకయ్య శంకుస్థాపన
author img

By

Published : Aug 10, 2020, 10:59 PM IST

రాజ్యసభ ఉద్యోగుల హౌసింగ్​ కాంప్లెక్స్​కు శంకుస్థాపన చేశారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. దిల్లీలోని ఆర్​కే పురమ్​లో రూ. 46 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 2003లో ఈ ప్రాజెక్టుకు స్థలం కేటాయించినప్పుటికీ.. పనులు ప్రారంభించటంలో జాప్యం కావటంపై ఆందోళన వ్యక్తం చేశారు వెంకయ్య.

" 17 ఏళ్లపాటు జాప్యం ఫలితంగా రాజ్యసభ సచివాలయంపై అనవసరపు ఖర్చులు చేరి అదనపు భారం పడింది. విలువైన భూ వనరులను ఉపయోగించుకోక పోవటానికి కారణం సామాజిక, ఆర్థిక, చట్ట, పరిపాలనాపరమైన అడ్డంకులే. ఆ అడ్డంకులు తొలగించేందుకు గత రెండేళ్లలో పలుమార్లు అధికారులతో చర్చలు జరిపాం."

- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

2003లో కేటాయించిన 8,700 చదరపు మీటర్లు స్థలాన్ని సకాలంలో వినియోగించుకుని ఉంటే సచివాలయానికి ఇంటి రెంటు, ఇతర అలవెన్స్​లు​ కలిసొచ్చేవన్నారు వెంకయ్య. ఎన్​డీఎంసీ కాంప్లెక్స్​లో ఉన్న ఆర్​ఎస్​టీవీకి ఏడాదికి రూ. 30 కోట్ల వార్షిక రెంటు కడుతున్నట్లు పేర్కొంటూ.. ఛానల్​ను ఆర్​కే పురామ్​కు మార్చటం ద్వారా భారీ మొత్తం మిగులుతుందన్నారు. అలాగే.. హౌసింగ్​ కాంప్లెక్స్​ పని ప్రదేశానికి దగ్గరగా ఉండటం ద్వారా ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు వెంకయ్య.

ఇదీ చూడండి: నేపాల్​ వల్లే బిహార్​కు ఇన్ని ఇబ్బందులు: నితీశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.