ETV Bharat / bharat

రాజ్​నాథ్​తో రాజె భేటీ- 'రాజ'కీయాలపై చర్చ!

భాజపా సీనియర్ నేత, కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు తమపై దాఖలైన అనర్హత వేటు పిటిషన్లను రాజస్థాన్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ కాంగ్రెస్​లో విలీనమైన బీఎస్పీ ఎమ్మెల్యేలు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

vasundara raje meets union minister rajnath singh discusses current political situation in rajastan
రాజ్​నాథ్​తో వసుంధర భేటీ- 'రాజ'కీయాలపై చర్చ!
author img

By

Published : Aug 9, 2020, 7:26 AM IST

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె శనివారం దిల్లీలో పార్టీ సీనియర్ నేత, రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​తో భేటీ అయ్యారు. ఎడారి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల్ని వారు చర్చించుకున్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా దిల్లీలోనే ఉన్న వసుంధర రాజె.. పార్టీ అధ్యక్షుడు జె.పి నడ్డాతో, పార్టీ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్​తో శుక్రవారం సమావేశమయ్యారు. వీటి సారాంశమేమిట నేది పార్టీ ప్రకటించలేదు.

రాజస్థాన్​లో గత నెలలో రాజకీయ సంక్షోభం మొదలై పలు మలుపులు తిరుగుతున్నా ఆమె చాలావరకు మౌనంగానే ఉన్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి రాజస్థాన్​లో సర్కారును కూల్చాలని భాజపాలో ఒక వర్గం ఆసక్తి చూపిస్తున్నా, రాజె మాత్రం ఉత్సాహం కనపరచట్లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు కాంగ్రెస్​లో విలీనమైన బీఎస్పీ ఎమ్మెల్యేలు తమపై దాఖలైన అనర్హత వేటు పిటిషన్లను రాజస్థాన్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇలాంటి మరో రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఉన్నాయని వారు తెలిపారు.

పోర్​బందర్​కు ఆరుగురు భాజపా ఎమ్మెల్యేలు

రాజస్థాన్ శాసనసభ సమావేశాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భాజపా తమ ఎమ్మెల్యేల్లో మరో ఆరుగురిని శనివారం ఓ అద్దె విమానంలో గుజరాత్​లోని పోర్​బందర్​కు తరలించింది. శుక్రవారం 12 మంది ఎమ్మెల్యేలను ఇలాగే అహ్మదాబాద్​కు పంపించింది. అక్కడ వారొక రిసార్టులో మకాం వేశారు. తమ ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్ని భాజపా రాజస్థాన్ అధ్యక్షుడు సతీష్ పూనియా తోసిపుచ్చారు. తమ సభ్యులంతా ఐక్యంగా ఉన్నారని, కాంగ్రెస్ సర్కారే లేని పోనివి ప్రచారం చేస్తోందని చెప్పారు.

ట్యాపింగ్ వదంతులపై విచారణ: డీజీపీ

జైసల్మేర్‌లోని హోటల్లో ఉన్న ఆరుగురు భాజపా ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న వదంతులపై విచారణ జరిపి, తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా జైపూర్ పోలీసు కమిషనర్‌కు రాజస్థాన్ డీజీపీ భూపేంద్ర సింగ్ ఆదేశించారు. పూర్తి నిరాధారమైన ఆరోపణలపై తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పారు. శాసనసభ్యుల్లో ఏ ఒక్కరి ఫోన్లపైనా తమ శాఖ గతంలో గానీ, ఇప్పుడు గానీ నిఘా విధించలేదని స్పష్టంచేశారు. హోటల్లోని ఇంటర్​కమ్ సదుపాయం ద్వారా సంభాషణల్ని రికార్డు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.