ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ 'సింగిల్ యూస్ ప్లాస్టిక్'పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మానవ హారంలో పాల్గొన్నారు. దాదాపు లక్షమంది పాఠశాల, కళాశాలల విద్యార్థులు, వ్యాపారులు, మేధావులు తదితరులు హాజరయ్యారు. వీరంతా కలిసి తాము ప్లాస్టిక్‌ను ఉపయోగించమని ప్రతిజ్ఞ చేశారు.
మియాన్వాలా అనే ప్రాంతం నుంచి సిటీ టవర్ దాకా దాదాపు 50 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా నిల్చొని మానవ హారం చేపట్టారు. తాత్కాలిక అవసరాల నిమిత్తం ప్లాస్టిక్‌తో తయారుచేసి వాడే చేతి సంచులు, భోజన కంచాలు, టీ స్పూన్లు, కప్పుల వల్ల పర్యావరణానికి, జీవరాశులకు ముప్పువాటిల్లుతుందని అన్నారు.
"ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల జీవరాశుల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ పాలిథీన్ కవర్లు మురికి కాలువల్లో అడ్డుపడుతున్నాయి. ఫలితంగా మురికి నీరంతా రోడ్లపై పారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేయాలి."
-త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
ఇదీ చూడండి : డ్రైవర్ నిద్రతో ప్రమాదం... ఐదుగురు మృతి