కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఉత్తర్ప్రదేశ్ ఘాజీపుర్లో జరిగింది. ఆరు నెలలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు ఆ కిరాతకుడు. భార్త ప్రవర్తనను గమనించిన భార్య.. తన పద్దతిని మార్చుకోమని చెప్పింది. అయినా అతడు వినపించుకోలేదు. దీంతో బాలిక తల్లి స్థానిక దుల్హాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి.. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఘాజీపుర్ ఎస్పీ ఓం ప్రకాశ్ సింగ్ తెలిపారు. బాధితురాలిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.