జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లకు ఉమ్మడి హైకోర్టు ఉండనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర జుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ రాజీవ్ గుప్తా వెల్లడించారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. కేంద్రానికి చెందిన 108 చట్టాలు, 166 రాష్ట్ర చట్టాలు వర్తిస్తాయన్నారు. మరోవైపు 164 రాష్ట్ర చట్టాలు రద్దుకానున్నట్టు స్పష్టం చేశారు.
ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది కేంద్రం. దీనితో పాటు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఉంటుందని.. శాసనసభ లేకుండానే లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతుందని గుప్తా తెలిపారు.
ఇదీ చూడండి:- 'తలపై తుపాకీ పెట్టి మాట్లాడమంటే ఎలా?'