అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో.. భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై ఇరుదేశాల నేతలు ప్రధానంగా చర్చించారు. ఇరాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మైక్ పాంపియో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి ఉగ్రవాద ముప్పుతో భారత ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. ఈ విషయంలో భారత్‌కు అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతమయ్యే దిశగా కీలక ఒప్పందాలు చేసుకున్నారు. హెచ్-1బీ వీసాలు, ఇరాన్ ముడిచమురుపై అగ్రరాజ్యం ఆంక్షలతో భారత్‌లో నెలకొన్న పరిస్థితులు, తదితర అంశాలపై ఇరుదేశాల విదేశాంగ మంత్రులు చర్చించారు.
భారత్‌లో మూడురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు పాంపియో. ఈ ఉదయమే మోదీతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య పలు కీలక అంశాలతో పాటు ఈ వారాంతంలో జరగనున్న జీ-20 సదస్సుపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో చర్చలు జరిపారు పాంపియో. భారత్‌లో పాంపియో పర్యటన రేపటితో ముగియనుంది.
ఇదీ చూడండి : ప్రధాని మోదీతో మైక్ పాంపియో భేటీ