ETV Bharat / bharat

నమస్తే ట్రంప్​: అధ్యక్షుడి పూర్తి షెడ్యూల్​ ఇదే

author img

By

Published : Feb 23, 2020, 4:43 PM IST

Updated : Mar 2, 2020, 7:32 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రెండు రోజుల భారత పర్యటన కోసం సోమవారం రానున్నారు. ట్రంప్​ ఏ సమయానికి చేరుకుంటారు? ఏ ప్రాంతాలకు వెళ్లనున్నారు సహా మరిన్ని విశేషాలు చూద్దాం.

US PRESIDENT TRUMP TWO DAYS SCHEDULE IN INDIA
నమస్తే ట్రంప్​: అధ్యక్షుడి పూర్తి షెడ్యూల్​ ఇదే

రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ సోమవారం అహ్మదాబాద్​ చేరుకోనున్నారు. తొలి రోజు అహ్మదాబాద్​లో భారీ రోడ్​ షో, నమస్తే ట్రంప్​ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తరువాతి రోజు ట్రంప్​ షెడ్యూల్​ మొత్తం దిల్లీలో ఉండనుంది.

ఫిబ్రవరి 24 షెడ్యూల్​...

  1. డొనాల్డ్​ ట్రంప్​ సోమవారం మధ్యాహ్నం 11.55 నిమిషాలకు గుజరాత్​ అహ్మదాబాద్​లోని సర్దార్​ వల్లభ్​ ​భాయ్​ పటేల్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.
  2. మధ్యాహ్నం 12.15 నిమిషాలకు విమానాశ్రయం నుంచి మోటేరా స్టేడియం వరకు 22 కి.మీ భారీ రోడ్​ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్​ పాల్గొంటారు. అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికేందుకు వచ్చే వారితో నగరవీధులన్నీ కిక్కిరిసిపోనున్నాయి.
  3. రోడ్​ షో లో భాగంగా మోదీ, ట్రంప్​ సబర్మతి ఆశ్రమానికి వెళ్తారు. అధ్యక్షుడికి ఓ రాట్నం, గాంధీ రాసిన రెండు పుస్తకాలను బహుమానంగా మోదీ ఇస్తారు. 30 నిమిషాల పాటు వారు ఆశ్రమంలో ఉండే అవకాశం ఉంది.
  4. రోడ్​ షో పూర్తయిన వెంటనే ఇరువురు నేతలు కలసి ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్​ స్టేడియం మోటేరాకు 12.45 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడ జరిగే నమస్తే ట్రంప్​ కార్యక్రమంలో లక్ష మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంది.
  5. తర్వాత అమెరికా అధ్యక్షుడు సతీమణి మెలానియా ట్రంప్​తో కలసి ఆగ్రాకు పయనమవుతారు. సూర్యాస్తమయం లోపు వారు తాజ్​మాహల్​ను సందర్శించి దిల్లీకి బయల్దేరతారు.

ఫిబ్రవరి 25 షెడ్యూల్​...

  1. ఫిబ్రవరి 25 ఉదయం అధ్యక్షుడు ట్రంప్​ సతీసమేతంగా రాష్ట్రపతి భవన్​లో జరిగే స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు.
  2. అనంతరం రాజ్​ఘాట్​లోని మహాత్మా గాంధీ సమాధికి వెళ్లి నివాళులర్పిస్తారు.
  3. తర్వాత హైదరాబాద్​ హౌస్​లో ట్రంప్​, మోదీ మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ విందు ఇస్తారు.
  4. అనంతరం ట్రంప్​ అమెరికా రాయబారి కార్యాలయానికి వెళ్లి దిగ్గజ వ్యాపారవేత్తలతో రౌండ్​ టేబుల్​ సమావేశం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  5. సాయంత్రం రాష్ట్రపతి భవన్​కు చేరుకుని రామ్​నాథ్ కోవింద్​ ఇచ్చే విందుకు హాజరవుతారు ట్రంప్​. తర్వాత అమెరికాకు తిరుగు పయనమవుతారు.

Last Updated : Mar 2, 2020, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.