ఎటూ చూసినా ట్రంప్-మోదీ చిత్రాలు, భారీ కటౌట్లు, బ్యాండ్ బాజాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లక్షలాది జనం.. ఇలా అహ్మదాబాద్ విమానాశ్రయంలో మొదలు తాజ్ పర్యటన వరకు ట్రంప్ తొలిరోజు పర్యటనలో విశేషాలెన్నో జరిగాయి.
తాజ్ సందర్శన తర్వాత ట్రంప్ దిల్లీ చేరుకున్నారు. రాత్రి అక్కడే ఐటీసీ మౌర్య హోటల్లో బస చేసిన డొనాల్డ్ ఇవాళా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా నేటి షెడ్యూల్ పూర్తిగా దిల్లీలో ఉండనుంది. ట్రంప్ ఏ సమయానికి ఎక్కడకు వెళతారు సహా పూర్తి షెడ్యూల్‌ను విదేశాంగ శాఖ ప్రకటించింది.
తొలుత రాష్ట్రపతి భవన్లో ట్రంప్ దంపతులకు అధికారిక స్వాగత కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. తర్వాత రాజ్‌ఘాట్‌లోని మహాత్మగాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. మోదీతో ద్వైపాక్షిక చర్చల అనంతరం.. అమెరికా ఎంబసీ అధికారులతో సమావేశం కానున్నారు. ఇదే సమయంలో పలువురు వ్యాపారవేత్తలతో చర్చలు జరిపే అవకాశముంది. పలు కార్యక్రమాల అనంతరం రాత్రి 10 గంటలకు స్వదేశానికి బయల్దేరనున్నారు. ఇంతటితో తొలిసారి భారత్‌లో పర్యటించిన ట్రంప్ షెడ్యూల్ ముగియనుంది.
- ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: పర్యటన తొలిరోజు హైలైట్స్