ETV Bharat / bharat

రాష్ట్రపతి భవన్​లో ట్రంప్​కు ఘన స్వాగతం

భారత్​లో రెండో రోజు పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ దిల్లీలోని రాష్ట్రపతి భవన్​కు వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.

us-president-donald-trump-receives-ceremonial-reception-at-rashtrapati-bhawan
రాష్ట్రపతి భవన్​లో ట్రంప్​ దంపతులకు ఘన స్వాగతం
author img

By

Published : Feb 25, 2020, 10:23 AM IST

Updated : Mar 2, 2020, 12:18 PM IST

రాష్ట్రపతి భవన్​లో ట్రంప్​ దంపతులకు ఘన స్వాగతం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఆయన సతీమణి మెలానియాకు​ దిల్లీలోని రాజ్​భవన్​లో ఘన స్వాగతం లభించింది. ట్రంప్​ దంపతులకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక లాంఛనాలతో సాదర స్వాగతం పలికారు. భారత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని అమెరికా అధ్యక్షుడు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి ట్రంప్​ కుమార్తె ఇవాంకా​, అల్లుడు కుష్మర్​ కూడా హాజరయ్యారు. భారత్​ తరఫున పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.

అనంతరం రాజ్​ఘాట్​కు బయలుదేరారు ట్రంప్​ దంపతులు. మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఆ తర్వాత దిల్లీలోని హైదరాబాద్​ హౌస్​లో ప్రధాని మోదీతో అవుతారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలపై అగ్రనేతలిద్దరూ సంతకాలు చేసే అవకాశముంది.

Last Updated : Mar 2, 2020, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.