ETV Bharat / bharat

'వావ్​ భారత్​..! నేను అమెరికా తిరిగి వెళ్లను..' - corona virus India

గత 5నెలలుగా కోచిలో ఉంటున్న అమెరికావాసి జానీ పీర్స్​కు భారత దేశం విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా కరోనా వైరస్​ను దేశం కట్టడి చేస్తున్న తీరుకు మంత్ర ముగ్ధుడయ్యారు. వైరస్​ కట్టడిలో అమెరికా విఫలమైందని.. తాను భారత్​లోనే ఉండిపోతానని అంటున్నారు. ఈ మేరకు తన పర్యాటక వీసాను బిజినెస్​ వీసాగా మార్చాలని కేరళ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

US national Johnny Pierce has approached Kerala High Court seeking to convert his tourist visa into business visa
'వావ్​ భారత్​.. నేను అమెరికా తిరిగి వెళ్లను...'
author img

By

Published : Jul 12, 2020, 9:26 AM IST

అమెరికా.. భూతల స్వర్గం! అవకాశం దొరకాలే గానీ ఇప్పటికీ అక్కడ స్థిరపడాలీ అనుకొనే వారి సంఖ్య ఎక్కువే. హెచ్‌-1బి సహా చాలా రకాల వీసాలను తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల ఎంతమంది విలపించారో అందరికీ తెలిసిందే. అయితే 74 ఏళ్ల ఓ వృద్ధుడు మాత్రం తిరిగి తన దేశమైన అమెరికాకు వెళ్లనంటున్నారు. భారత్‌లోనే ఉంటానంటున్నారు. కొవిడ్‌-19ని కట్టడి చేయడంలో అగ్రరాజ్యం విఫలమైందని... భారత్‌ విజయవంతమైందని భావిస్తున్నారు. తన పర్యాటక వీసాను బిజినెస్‌ వీసాగా మార్చాలని కేరళ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇంతకీ ఆయన పేరేంటంటే జానీ పాల్‌ పీర్స్‌.

పర్యాటక వీసాపై పీర్స్‌ భారత్‌కు వచ్చారు. ఐదు నెలలుగా కోచిలో ఉంటున్నారు. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికా విఫలమైందని ఆయన అంటున్నారు. భారత్‌ మాత్రం అద్భుతంగా నియంత్రించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన దేశం వెళ్లేందుకు అయిష్టంగా ఉన్న ఆయన తన వీసాను బిజినెస్‌ వీసాగా మార్చాలని కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలా మారిస్తే మరో 180 రోజులు ఇక్కడే ఉండొచ్చన్నమాట.

కేరళలోనే మరికొంత కాలం ఉండి పర్యాటక సంస్థను ప్రారంభించాలని పీర్స్‌ భావిస్తున్నారు. 'భారత్‌లో వైరస్‌ నియంత్రణ తీరు నన్ను ఆకట్టుకుంది. అమెరికాలోని ప్రజలు కొవిడ్‌-19ను లెక్కచేయడం లేదు. అందుకే నా కుటుంబం సైతం ఇక్కడి వస్తే బాగుండనిపిస్తోంది' అని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఎనిమిది లక్షలకుపైగా కొవిడ్‌-19 కేసులు ఉండగా అమెరికాలో 30 లక్షలు దాటేశాయి. మరణాల సంఖ్య సైతం 1,33,000 దాటింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.