బిహార్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 10 జిల్లాల్లో వరద సమస్య నెలకొందని ప్రభుత్వం ప్రకటించింది. సీతామార్హి, శివహార్, సుపాల్, కిషన్గంజ్, దర్భంగా, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్ జిల్లాలు వరద జలాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడించింది.
మొత్తంగా 529 గ్రామపంచాయతీలపై వరద జలాల ప్రభావం పడిందని.. 9,60,831 మంది పౌరుల జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని అధికారులు తెలిపారు. 93 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్పష్టం చేశారు.
అత్యవసర సేవలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేసినట్లు వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో 22 బృందాలను మోహరించామని, కేంద్ర కార్యాలయంలో మరో 5 టీమ్లు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: ఒక్క ఇల్లు కనిపించకుండా నీటమునిగిన ఊరు