ETV Bharat / bharat

కరోనా వల్ల ఖైదీలు, పోలీసులకు మధ్య ఘర్షణ-ముగ్గురు మృతి - కారాగారంలో ఖైదీల ఘర్షణ

పశ్చిమ బంగాల్​లో ఖైదీలు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ముగ్గురు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నేపథ్యంలో ఖైదీలను కలిసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హింసకు దారి తీసింది.

update-of-dumdum-clash-clash
ఖైదీలు, పోలీసులకు మధ్య ఘర్షణ-ముగ్గురు మృతి
author img

By

Published : Mar 21, 2020, 6:53 PM IST

Updated : Mar 21, 2020, 11:20 PM IST

కరోనా వల్ల ఖైదీలు, పోలీసులకు మధ్య ఘర్షణ-ముగ్గురు మృతి

పశ్చిమ బంగాల్​లోని డమ్​డమ్​ కారాగారంలో ఖైదీలు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ముగ్గురు ఖైదీలు మరణించారు. మరికొంత మంది గాయపడ్డట్లు సమాచారం.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 వరకు ఖైదీలను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతిని నిరాకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన మొదలైనట్లు అధికారులు తెలిపారు. పోలీసులపై రాళ్లు రువ్వుతూ, జైలు ఆస్తులకు ఖైదీలు నిప్పంటించినట్లు జైలు సిబ్బంది పేర్కొన్నారు.

తొలుత కొంతమంది ఖైదీలు తమను పెరోల్​ మీద బయటకు పంపాలని కోరినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. అందుకు నిరాకరించడం వల్ల ఆందోళన చేపట్టినట్లు చెప్పారు. చివరకు ఈ ఆందోళన పోలీసులు, ఖైదీలకు ఘర్షణలా మారినట్లు వెల్లడించారు.

ఘర్షణను అదుపు చేయడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పోలీసులతో కలిసి ఆర్ఏ​ఏఫ్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పేసినట్లు పేర్కొన్నారు. ఘటనకు కారణమైన ఖైదీలను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు జైలు అధికారులు. ఈ ఘర్షణలో ముగ్గురు ఖైదీలు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

కరోనా వైరస్ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఖైదీల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలనుకునే వారికి ఫోన్ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కరోనాపై ఐక్యంగా పోరాడదాం.. 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దాం

Last Updated : Mar 21, 2020, 11:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.