గంగా స్నానాలు చేసేందుకు...
గంగానదిలో స్నానాలు చేసేందుకు హాత్రాస్ సమీపంలోని మోహన్పుర్ గ్రామం నుంచి కొందరు నరోరా గంగాఘాట్ ప్రాంతానికి గురువారం సాయంత్రం వచ్చారు. వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన అనంతరం రాత్రి రోడ్డు పక్కన నిద్రించి తెల్లవారు జామున స్నానాలు ఆచరించాలనుకున్నారు. కానీ వారిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఉదయం 4 గంటల ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ బస్సు వారిపైనుంచి దూసుకెళ్లింది.
ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేప్టటారు.
మృతులను మోహన్పుర్ గ్రామానికి చెందిన ఫూలవతి (65), మాలాదేవి (32), షీలాదేవి (35), యోగిత (5), కల్పన (3), రేణు (22), సంజన (4)గా గుర్తించారు.
ఇదీ చూడండి: ఆమెను హత్య చేసిన కిరాతకుడికి 100ఏళ్లు జైలుశిక్ష