ETV Bharat / bharat

'చౌకీదార్ నాటకాలను ప్రజలు నమ్మరు'

భాజపా అవలంబిస్తున్న విద్వేషపూరిత విధానాలకు ఓటమి తప్పదని ఉత్తర్​ప్రదేశ్​ మహాకూటమి పార్టీల నేతలు జోస్యం చెప్పారు. అందరూ ఏకమై చౌకీదార్​ను పదవి నుంచి తొలగించాలని సహారణ్​పుర్​ దేవ్​బంద్​ సభ వేదికగా ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీ నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు​.

'చౌకీదార్ నాటకాలను ప్రజలు నమ్మరు'
author img

By

Published : Apr 7, 2019, 8:38 PM IST

యూపీలో మాహాకూటమి సభ

భాజపా ఓటమే లక్ష్యంగా ఉత్తర్​ప్రదేశ్​లో జట్టుకట్టిన సమాజ్​వాదీ పార్టీ, బహుజన్​ సమాజ్​ పార్టీ, రాష్ట్రీయ లోక్​ దళ్​... ప్రచార శంఖారావం పూరించాయి. సహారణ్​పుర్​ దేవ్​బంద్​లో మొదటిసారి సంయుక్తంగా బహిరంగ సభ నిర్వహించాయి. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్​ఎల్​డీ అధ్యక్షుడు అజిత్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

భాజపా, కాంగ్రెస్​ల​పై విమర్శలతో విరుచుకుపడ్డారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ప్రభుత్వ సంస్థలను ప్రధాన మంత్రి నేరేంద్ర మోదీ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి పతాక స్థాయికి చేరిందని విమర్శించారు. బోఫోర్స్​తో కాంగ్రెస్​, రఫేల్​ ఒప్పందంతో భాజపా అపకీర్తిని మూటగట్టుకున్నాయన్నారు.

"భాజపాకు ఈసారి ఓటమి తప్పదు. ఈ ఎన్నికల్లో వాళ్ల నాటకాలను, మభ్యపెట్టే హమీలను ప్రజలు నమ్మరు. ఈసారి చౌకీదార్ కూడా ఓటమి నుంచి కాపాడలేరు. మంచి రోజలు తీసుకొస్తానని ప్రజలను ప్రలోభ పెట్టి, అధికారంలోకి వచ్చాక వారి కోసం ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమాన్నీ చేపట్టలేదు."
-మాయావతి, బీఎస్పీ అధినేత్రి

అప్పుడు చాయ్​వాలా-ఇప్పుడు చౌకీదార్​

గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు జమ చేస్తామన్న మోదీ, ఈ ఎన్నికల్లో అందరినీ చౌకీదార్లను చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు అఖిలేశ్.

" ఈ ఎన్నికలు చరిత్ర సృష్టించే ఎన్నికలు. గత ఎన్నికల్లో చాయ్​వాలా అంటూ ఒకరొచ్చారు. మంచిరోజులు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.. రూ.15 లక్షలు ఇస్తామని వాగ్దానం చేశారు. కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ ఎన్నికలొచ్చాయి. మనందరినీ చౌకీదార్లను చేశారు. పేదలు, రైతులు అందరూ ఏకమై చౌకీదార్​ను పదవి నుంచి తొలగించాలి."
-అఖిలేశ్​ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు

'అచ్చేదిన్​' ప్రజలకు కాదు

ఐదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్ఎల్​డీ అధినేత అజిత్ సింగ్​. మోదీ 'అచ్చేదిన్'​ ఆయన కోసమే కానీ ప్రజల కోసం కాదని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు.

"ఈ ఎన్నికలు దేశాన్ని కాపాడేందుకు జరిగే ఎన్నికలు. 70 ఏళ్లలో తొలిసారి నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు కలిసి దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు. ప్రభుత్వ సంస్థలను మోదీ నాశనం చేశారు. సీబీఐ, ఈడీ అధికారులతో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయిస్తున్నారు. "
-అజిత్​ సింగ్, ఆర్​ఎల్​డీ అధ్యక్షుడు

ఇదీ చూడండి: 'నన్ను గద్దె దించేందుకు ఎంతకైనా దిగజారుతారు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
TUNISIAN PRESIDENCY HANDOUT - AP CLIENTS ONLY
Monastir - 6 April 2019                                                                       
1. Wide of Tunisian President Beji Caid Essebsi's speech at Nidaa Tounes party's congress
2. SOUNDBITE (Arabic) Beji Caid Essebsi, Tunisian President:
++STARTS ON SHOUT OF CROWD++
"In all honesty, I don't think I will run for another term, Tunisia is full of qualified people but unfortunately they are not in the political scene. They have to take the responsibility and have a role."
3. Wide of  members of Nidaa Tounes party at their congress.
STORYLINE:
Tunisia's 92-year-old President Beji Caid Essebsi on Saturday announced he won't run for a second term.
He was speaking at the first electoral congress of his Nidaa Tounes party.
Presidential elections are scheduled for November 10.
They have been held along with parliamentary elections in Tunisia since the 2011 revolution that triggered the Arab Spring.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.