ఉత్తర్‌ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్‌కు కరోనా పాటిజివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. సదరు మంత్రి సతీమణికి కూడా మహమ్మారి సోకినట్లు వెల్లడించారు.
పాటిజివ్‌గా తేలిన వెంటనే మంత్రిని, ఆయన భార్యను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.
మంత్రికి కరోనా సోకినట్లు తెలుసుకున్న అధికారులు మంత్రితో సంబంధం ఉన్న వారి ఆచూకిీ తెలుసుకునే పనిలో ఉన్నారు. ప్రతాప్‌గఢ్ జిల్లా పట్టి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రతాప్ సింగ్ గెలిచారు.
ఇదీ చూడండి:మూగజీవి మౌనరోదన.. పేలుడు పదార్థం తిన్న వృషభం