ఉత్తర్ప్రదేశ్ బరేలీ పోలీసులు ఓ వాహన చోదకుడిపై విధించిన చలానా విషయం.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కారు నడుపుతున్న వ్యక్తి శిరస్త్రాణం ధరించలేదని రూ. 500 చలానా విధించారు రక్షకభటులు.
బరేలీకి చెందిన వ్యాపారి అనీశ్ నరూలా... కారులో హెల్మెట్ ధరించనందుకు ఆయనకు రూ. 500 చలానా జారీ చేశారు అధికారులు. ఈ వ్యవహారంపై కలత చెందిన నరూలా... తప్పుగా జరిమానా విధించారని అధికారులకు ఫిర్యాదు చేశారు.
"ఈ-చలాన్ ద్వారా నా కారుపై చలానా విధించారని తెలిసింది. కారులో హెల్మెట్ ధరించనందుకు రూ. 500 జరిమానా వేశారు. నిజమేనా అని నిర్ధరించుకుని అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చాను. జరిమానాలో వాహన నెంబర్ కూడా నా కారునే చూపిస్తోంది."
-అనీశ్ నరూలా, బాధితుడు
ఈ-చలాన్ విధించే క్రమంలో సీటుబెల్టు, హెల్మెట్ అన్న పదాలు వరుసగా ఉంటాయని... ఈ నేపథ్యంలోనే తప్పుగా జరిమానా విధించినట్లు ఎస్పీ సుభాశ్ చంద్ర గాంగ్వార్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారానికి సంబంధించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చూడండి: నమో 2.0: దౌత్యపరంగా సూపర్ హిట్