ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో జర్నలిస్ట్​ సజీవదహనం - ఉత్తర్​ ప్రదేశ్ తాజా వార్తలు

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ స్థానిక జర్నలిస్ట్​ ఇల్లును తగలబెట్టారు దుండగులు. ఈ ఘటనలో విలేకరి సహా అతని స్నేహితుడు ప్రాణాలు కోల్పోయారు.

UP: Journalist burnt to death in Balrampur
ఇల్లు దగ్ధం.. జర్నలిస్టు మృతి
author img

By

Published : Nov 30, 2020, 9:18 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ బలరామ్​పుర్​లో ఆదివారం దారుణం జరిగింది. రాకేష్​ సింగ్​ నిర్భిక్​ అనే ఓ స్థానిక విలేకరి ఇంటికి దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో విలేకరితో పాటు అతని స్నేహితుడు.. సజీవ దహనమయ్యారు. ఆ సమయంలో విలేకరి భార్య, పిల్లలు తమ బంధువుల ఇంటికి వెళ్లగా వారికి ప్రాణాపాయం తప్పింది.

ఈ నేరానికి పాల్పడ్డ వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనుమానితులను నాలుగు బృందాలు ప్రశ్నిస్తున్నాయని, ఘటనాస్థలి నుంచి సాక్ష్యాలను సేకరిస్తున్నామని తెలిపారు. ఆర్థిక భరోసా కింద జిల్లా యంత్రాంగం జర్నలిస్టు భార్యకు రూ.5 లక్షల చెక్కును అందజేసింది. బలరాంపుర్​ చక్కెర కర్మాగారంలో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించింది.

ఇదీ చూడండి:రూ.200 అప్పు ఇవ్వలేదని మెకానిక్ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.