కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా 58 మందితో మంత్రి వర్గం ఏర్పాటయింది. కీలక రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. యూపీ వారణాసి నుంచి మోదీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, లఖ్‌నవూ ఎంపీ స్థానం నుంచి రాజ్‌నాథ్ సింగ్ గెలుపొందారు.
ఏడుగురు మంత్రులతో యూపీ తర్వాత రెండోస్థానంలో మహారాష్ట్ర నిలిచింది. ఆరుగురు మంత్రులతో బిహార్‌కు మూడో స్థానం దక్కింది.
గుజరాత్, రాజస్థాన్, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రి వర్గంలో అవకాశం లభించింది. పశ్చిమ్‌బంగ, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఇద్దరిని చొప్పున మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్, రాజస్థాన్, హరియాణాలో భాజపా క్లీన్‌స్వీప్ చేసింది.
ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మణిపుర్, మిజోరం, సిక్కిం, త్రిపుర తప్ప మిగతా అన్ని రాష్ట్రాలకూ కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కింది.
యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు.
నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, మహేంద్ర నాథ్ పాండే, సంజీవ్ బల్యాన్, సాధ్వి నిరంజన్ జ్యోతి, వీకే.సింగ్, సంతోష్ గాంగ్వర్, హర్దీప్ సింగ్ పూరీ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీలు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు గానూ 62 స్థానాల్లో భాజపా గెలుపొందింది. ఎన్డీఏ కూటమికి 64 స్థానాలు దక్కాయి.
మహారాష్ట్ర నుంచి..
నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జావడేకర్, పీయుష్ గోయల్, అరవింద్ సావంత్, దన్వి పాటిల్, రామదాస్ అథవాలే, శ్యాంరావ్ ధోత్రే మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బిహార్ నుంచి
రామ్ విలామ్ పాసవాన్, రవిశంకర్ ప్రసాద్, గిరిరాజ్ సింగ్, ఆర్కే సింగ్, అశ్వనీ కుమార్ చౌబే, నిత్యానంద్ రాయ్ బిహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
దిల్లీలో మొత్తం 7 స్థానాల్లో గెలుపొందింది భాజపా. ఇక్కడి నుంచి హర్ష వర్ధన్‌కు కేబినెట్లో చోటు దక్కింది.
ఇదీ చూడండి: నమో 2.0 : మంత్రివర్గం నుంచి సీనియర్లకు ఉద్వాసన