ETV Bharat / bharat

రాహుల్​ హాథ్రస్​ పర్యటన అడ్డుకునేందుకు యోగి వ్యూహం

author img

By

Published : Oct 3, 2020, 2:05 PM IST

హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు ఇవాళ రాహుల్​ గాంధీ హాథ్రస్​ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టింది యోగి ప్రభుత్వం. నోయిడా లోని దిల్లీ- యూపీ సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించింది. 144 సెక్షన్​ అమలు చేస్తోంది. అలాగే.. యూపీ కాంగ్రెస్​ చీఫ్​ సహా జిల్లా నాయకులు, కార్యకర్తలను గృహనిర్బంధం చేశారు.

UP cops deployed at DND
రాహుల్​ హాథ్రస్​ పర్యటన

ఉత్తర్​ప్రదేశ్​లో హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు హాథ్రస్​కు రాహుల్​ గాంధీ నేతృత్వంలో ఎంపీలు వెళ్లనున్న నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టింది యోగి ప్రభుత్వం. నోయిడాలోని దిల్లీ- ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దులో భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే అక్కడికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. గౌతమ్​ బుద్ధ నగర్​లో 144 సెక్షన్​ను కొనసాగిస్తున్నారు.

దిల్లీ- నోయిడా సరిహద్దును పూర్తిగా మూసివేయకపోయినప్పటికీ.. తనిఖీలు ముమ్మరం చేశామని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

యూపీ కాంగ్రెస్​ చీఫ్​ గృహనిర్బంధం..

రాహుల్​ గాంధీ హాథ్రస్​ పర్యటన నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు అజయ్​ కుమార్​ లాలును గృహనిర్బంధం చేశారు. లఖ్​నవూలోని ఆయన నివాసంలో భారీగా పోలీసులను మోహరించినట్లు పార్టీ అధికార ప్రతినిధి అన్షు అవాస్తి తెలిపారు. బయటకి వెళ్లేందుకు కూడా అనుమతించటం లేదన్నారు. రాహుల్​ గాంధీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసిన కుట్రలో ఇది భాగమేనని ఆయన తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జిల్లా అధ్యక్షులు, 500 మందికిపైగా కార్యకర్తలను నిర్బంధించినట్లు కాంగ్రెస్​ పార్టీ ట్వీట్​ చేసింది. న్యాయం కోసం పోరాడుతున్న వారిని యోగి ప్రభుత్వం ఆపలేదని పేర్కొంది.

రాజకీయాల కోసమే..

రాహుల్​ గాంధీ హాథ్రస్​ పర్యటనపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. కాంగ్రెస్​​ వ్యూహాలు ప్రజలకు తెలుసునన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో భాజపాకు చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని పేర్కొన్నారు. హాథ్రస్​ సందర్శన వారి రాజకీయాల కోసమే కానీ, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కాదని ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు.

ఇదీ చూడండి: హాథ్రస్​లోకి మీడియాకు అనుమతి- రాజకీయ నేతలకు నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.