సాయుధ దళాల చర్యలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదనే ఈసీ నిబంధనను యోగి ఉల్లంఘించారని ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కల్లా స్పందించాలని యోగికి ఈసీ సూచించినట్టు సమాచారం.
ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ సమర్పించిన వీడియో క్లిప్పుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం.
ఘజియాబాద్‌లో గత ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు యోగి ఆదిత్యనాథ్. ఉగ్రవాదం పట్ల కాంగ్రెస్ వైఖరిని విమర్శించారు. ప్రధాని మోదీని ప్రశంసించారు.
" కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదులకు బిర్యానీలు పెట్టారు. ఇప్పుజు మోదీ కీ సేన(మోదీ సైన్యం)మాత్రం ఉగ్రవాదులకు తూటాలు, బాంబుల రుచి చూపిస్తోంది. ఇదే రెండు పార్టీల మధ్య భేదం. మసూద్‌జీ అంటూ కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదులను గౌరవిస్తున్నారు"
-- ఘజియాబాద్ సభలో యోగి వ్యాఖ్యలు
దేశ భద్రతా దళాలు చేసిన పనులను ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవద్దని గతేడాది 19వ తేదీన ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను సూచనలు జారీ చేసింది. సైనికుల ఫొటోలు, పేర్లను వినియోగించకూడదని ఆదేశించింది.