ETV Bharat / bharat

ప్రభుత్వ బాలికల ఆశ్రమంలో 90 మందికి కరోనా

ఉత్తర్​ప్రదేశ్ బరేలీలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమంలో 90 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వీరిలో ఎవరికీ వైరస్​ లక్షణాలు లేనందున ఆస్పత్రికి తరలించకుండా ఐసోలేషన్​లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఆశ్రమంలో వైరస్ వ్యాప్తి ఎలా మొదలైందనే విషయంపై విచారణ జరపనున్నట్లు చెప్పారు.

UP: 90 inmates of govt shelter home for girls in Bareilly test coronavirus positive
ప్రభుత్వ బాలికల ఆశ్రమంలో 90మందికి కరోనా
author img

By

Published : Aug 17, 2020, 1:05 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బరేలి జిల్లాలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమం 'నారీ నికేతన్'​లో 90 మంది వైరస్​ బారినపడినట్లు మహిళా సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్​ నీతా అహిర్వార్ వెల్లడించారు. వీరందరినీ రెండస్తుల భవనంలో క్వారంటైన్​లో​ ఉంచినట్లు పేర్కొన్నారు. ఎవరిలోనూ వైరస్​ లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు.

ఆశ్రమంలోని సహాయక సిబ్బందిలో ఒకరికి కూడా ఇటీవలే పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఆ తర్వాత మొత్తం 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 90మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు నీతా చెప్పారు. ఓ వైద్యుల బృందం వీరిని సందర్శించి వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. వైరస్ వ్యాప్తి ఎలా మొదలైందనే విషయంపై విచారణ జరుపుతామన్నారు.

పరీక్షల అనంతరం ఆశ్రమం మొత్తాన్ని శానిటైజ్ చేసినట్లు జిల్లా అదనపు ముఖ్య వైద్యాధికారి ఆశోక్​ కుమార్​ చెప్పారు. వైరస్​ లక్షణాలు లేనందున ఎవరినీ ఆస్పత్రికి తరలించలేదని, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

జూన్​లోనూ..

యూపీ కాన్పుర్​ జిల్లాలోని చిన్నారుల ఆశ్రమంలోనూ జూన్ 21న 57 మంది బాలికలకు పాజిటివ్​గా తేలింది. వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మిగతా 114 మందిని వేరే ప్రాంతంలో క్వారంటైన్​కు తరలించారు.

యూపీలో కరోనా కేసుల సంఖ్య 1,45,287గా ఉంది. ఇప్పటి వరకు 2,335 మంది మరణించారు. 92,526 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 57,982 కరోనా కేసులు.. 941 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.