జమ్ము కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య సమావేశం ప్రారంభమయింది. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ అంశంపై అత్యవసరంగా చర్చ జరగాలని ఐరాస భద్రతా మండలికి లేఖ రాసింది పాకిస్థాన్.
పాక్ విన్నపాన్ని ప్రస్తావిస్తూ ఐరాసకు చైనా లేఖ రాసింది. ఈ మేరకు ఐరాస భద్రతా మండలి రహస్య సంప్రదింపులు జరుపుతోంది.
ఈ భేటీలో ఐదు శాశ్వత సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు పాల్గొనగా... భారత్, పాకిస్థాన్ పాల్గొనలేదు. ఇది కేవలం భారత్, పాక్‌ల ద్వైపాక్షిక సమస్య మాత్రమే అని రష్యా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి దిమిట్రీ పోలింస్కీ సమావేశానికి హాజరయే ముందు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్ అంశంలో దౌత్యపరంగా కేంద్రం విఫలం'