ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. బాధితురాలిని ఎయిమ్స్‌కు తరలించి వైద్యం అందించాలని సుప్రీంకోర్టు సోమవారం యూపీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు బాధితురాలిని హెలికాప్టర్‌లో ఎయిమ్స్‌కు తరలించారు.
మెరుగైన చికిత్స కోసం ఐసీయూకి తరలించారు. ఎయిమ్స్ ప్రత్యేక వైద్యుల బృందం ఆమెకు చికిత్స చేస్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితురాలికి ఇప్పటివరకు లఖ్‌నవూలో చికిత్స అందించారు. బాధితురాలిని దిల్లీకి తరలించేందుకు ఆమె తల్లి అంగీకరించినట్లు బాధితురాలి తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
అత్యంత జాగ్రత్తగా..
ప్రమాదంలో గాయపడిన కారణంగా ఎలాంటి కుదుపులు లేకుండా తరలించాలని వైద్యుల సూచించారు. ఈ మేరకు లఖ్‌నవూ నుంచి హెలికాప్టర్‌లో దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేర్చారు. అక్కడ నుంచి ఆసుపత్రికి 14 కిలోమీటర్ల దూరం అత్యంత జాగ్రత్తగా తరలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు దిల్లీ పోలీసులు.
కోర్టు ముందుకు నిందితుడు
ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దిల్లీలోని తిస్ హజారీబాగ్‌లోని ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రాంగణంలో హైడ్రామా నెలకొంది. మీడియా ప్రతినిధులెవరినీ పోలీసులు అనుమతించలేదు.
సెంగార్‌తోపాటు అయన అనుచరుడు శశి సింగ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ నుంచి తీహాడ్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి: 'ఉన్నావ్' విచారణకు సుప్రీం 45 రోజుల గడువు