ఉన్నావ్ అత్యాచార కేసుపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. కేసుకు సంబంధించిన స్థితి నివేదిక సమర్పించాలని సీబీఐ ట్రయల్ కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది.
విచారణ సమయాన్ని పొడిగించాలని అత్యాచార కేసులోని ఓ నిందితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించేందుకు నిందితులకు సమయం ఇవ్వడం లేదని ఆరోపించాడు. ఇది అన్యాయమైన విచారణ అని పేర్కొన్నాడు.
బాధితురాలి వాంగ్మూలం నమోదు...
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేసింది సీబీఐ. ప్రస్తుతం దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న యువతి వాంగ్మూలం నమోదు చేసింది.
2017లో భాజపా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె ఆరోపించింది. ఇటీవల బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీ కొట్టడం వల్ల ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో బాధితురాలి బంధువులు మరణించగా.. ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సెంగార్ హస్తమున్నట్లు బాధితురాలి బంధువులు ఆరోపించారు.
ఇదీ చూడండి: అయోధ్య కేసు న్యాయవాది రాజీవ్‌కు బెదిరింపులు!