ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో తీర్పును మార్చి 4వ తేదికి వాయిదా వేసింది దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
ఇప్పటికే ఉన్నావ్ అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సెంగార్.. బాధితురాలి తండ్రి హత్య కేసులోనూ నిందితుని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2018లో పోలీస్ కస్టడిలో బాధితురాలి తండ్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆయన మృతి వెనుక సెంగార్ హస్తం ఉందని సీబీఐ బలమైన సాక్ష్యాలను కోర్టు ముందు ప్రవేశ పెట్టింది. 55 మంది సాక్షులను కోర్టు ఎదుట హాజరుపరచింది. అత్యాచార బాధితురాలి మామ, తల్లి వాంగ్మూలాలు రికార్డు చేసి న్యాయస్థానానికి సమర్పించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును బుధవారానికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: డెత్ వారెంట్‌పై స్టే కోరుతూ 'నిర్భయ' దోషుల పిటిషన్