ETV Bharat / bharat

యువకుడి కడుపులో 35 ఇనుప మేకులు - unnao doctors took out iron Nails from a man's stomach

ఉత్తర్ ప్రదేశ్ లో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడి కడుపులోంచి 35 ఇనుప మేకులు బయటకు తీశారు వైద్యులు.

unnao-doctors-took-out-iron-nails-from-a-mans-stomach-in-uttarpradesh
యువకుడి కడుపులో 35 ఇనుప మేకులు
author img

By

Published : Oct 4, 2020, 5:16 PM IST

Updated : Oct 4, 2020, 7:10 PM IST

ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్​లో ఓ యువకుడి కడుపులోంచి.. 35 ఇనుప మేకులు బయటపడ్డాయి.

శుక్లాగంజ్​కు చెందిన కరణ్ గత కొద్దిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. నాలుగు రోజుల క్రితమే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. సీటీ స్కాన్, ఎక్స్-రే , అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఫలితాలు చూసి నివ్వెరపోయారు.

unnao-doctors-took-out-iron-nails-from-a-mans-stomach-in-uttarpradesh
పావుకిలో మేకులు

కరణ్ కడుపులో ఇనుప కడ్డీలేవో ఉన్నాయని తెలుసుకున్న వైద్యులు.. వెంటనే శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు చేశారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి 5 అంగుళాల పొడవైన మేకులు, 4 అంగుళాల 35 ఇనుప కడ్డీలు, బయటకు తీశారు. ఈ ఇనుప సామాను సుమారు 250 గ్రాముల బరువు తూగుతుందని తెలిపారు. అయితే, ఈ ఇనుప కడ్డీలు , మేకులు అతడి కడుపులోకి ఎలా వెళ్లాయన్నది తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: మూడు నెలల్లో అందుబాటులోకి ఆక్స్​ఫర్డ్ టీకా!

Last Updated : Oct 4, 2020, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.