ఉన్నావ్ కేసులకు సంబంధించిన ఓ వీడియో కలకలం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార నిందితుడు సెంగార్ ఉంటున్న సీతాపూర్ జైలు బయట ఓ పోలీసు అధికారికి ఉన్నావ్ పంచాయతీ సభ్యుడు రింకూ శుక్లా లంచం ఇస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. సెంగార్‌కు రింకూ శుక్లా అత్యంత సన్నిహితుడని సమాచారం.
ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆరోపణలు రుజువైతే నిందితులపై కఠిన చర్యలు చేపడతామన్నారు.
'టీ కోసం డబ్బులిచ్చుంటా..'
వీడియోపై స్పందించిన రింకూ సింగ్... సెన్గర్ను కలిసేందుకు డబ్బులు ఇవ్వలేదన్నాడు.
"అది నాకు అలవాటు. టీ తాగడం కోసం జైలు వద్ద ఉన్న పోలీసుకు డబ్బులు ఇచ్చి ఉంటా. అంతే కానీ సెంగార్‌ను కలవడానికి పోలీసుకు లంచం ఇవ్వలేదు. సెంగార్‌ను 10-15 రోజుల ముందే కలిశా. ఆయన మా ఎమ్మెల్యే. అందుకే కలవడానికి వెళ్లా."
--- రింకూ సింగ్, ఉన్నావ్ పంచాయతీ సభ్యుడు.
రోడ్డు ప్రమాద ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేపట్టింది. సెంగార్తో సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇదీ చూడండి:- 'మేం హిందుస్థానీ.. మా వీధి పాకిస్థానీ'