కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ కొవిడ్ బారినపడ్డారు. కరోనా ప్రాథమిక లక్షణాలతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు స్వయంగా ఆయనే ట్విట్టర్లో వెల్లడించారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపారు.
కొద్దిరోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా.. టెస్టులు చేయించుకోవాలని కోరారు కేంద్ర మంత్రి.