ETV Bharat / bharat

టీకా పంపిణీపై రాష్ట్రాలతో కేంద్రం భేటీ - కరోనా టీకా కేంద్రం భేటీ

కరోనా టీకా పంపిణీ సన్నద్ధతపై రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశమయ్యారు. ప్రాధాన్యత క్రమంలో టీకా పంపిణీకి పేర్లను సిద్ధం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. టీకా అందుబాటులోకి వస్తే మొదటి విడతలో కోటి మంది వైద్య సేవల సిబ్బంది టీకా స్వీకరిస్తారని సమాచారం.

Union home secy discusses with states possible COVID-19 vaccines roll-out
టీకా పంపిణీపై రాష్ట్రాలతో కేంద్రం భేటీ
author img

By

Published : Dec 10, 2020, 10:57 PM IST

వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా భేటీ అయ్యారు. టీకా పంపిణీ ఏర్పాట్లను సమీక్షించారు. ప్రాధాన్య జాబితాలో ఉండే వ్యక్తుల పేర్లతో డేటాబేస్ తయారు చేయాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, హోంగార్డులు, అగ్నిమాపక దళాలు, వైద్య సేవల సిబ్బంది పేర్లతో ఈ డేటాబేస్​ను రూపొందించాలని పేర్కొన్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశానికి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. అత్యవసర వినియోగానికి మూడు టీకా తయారీ సంస్థలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కోటి మందికి!

టీకా అందుబాటులోకి రాగానే వేగంగా సరఫరా చేసేందుకు కేంద్రం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు కోటి మంది వైద్య సేవల సిబ్బంది తొలి డోసు తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే 92 శాతం ప్రభుత్వ ఆస్పత్రులు, 55 శాతం ప్రైవేటు ఆస్పత్రులు సిబ్బందిని గుర్తించి సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.