ETV Bharat / bharat

తుపాను హెచ్చరికలతో ఆ రాష్ట్రాలు అప్రమత్తం - National Crisis Management Committee (NCMC)

తాజా తుపాను హెచ్చరికల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు కేబినెట్​ కార్యదర్శి రాజీవ్​ గౌబా. ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్​లను ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.

Union Cabinet Secretary Rajiv Gauba today chaired a meeting of National Crisis Management Committee (NCMC) t
తుపాను హెచ్చరికలతో ఆ 3 రాష్ట్రాలు అప్రమత్తం
author img

By

Published : Nov 23, 2020, 5:40 PM IST

తుపాను తీవ్రత దృష్ట్యా 3 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో(సీఎస్​).. కేబినెట్​ కార్యదర్శి రాజీవ్​ గౌబా నేతృత్వంలోని విపత్తు సంక్షోభ నిర్వహణ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, పుదుచ్చేరి సీఎస్​లు ఈ భేటీకి హాజరయ్యారు. ముందస్తు చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

తుఫాను కదలికలు, ఎంత ప్రభావం చూపుతుంది వంటి వివరాలతో ఐఎండీ డీజీ ప్రజెంటేషన్​ ఇచ్చారు. ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు గౌబా. తుపాను ప్రభావం నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

అన్ని విధాల సహాయ చర్యలకు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎస్​లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు జాతీయ విపత్తు నిర్వహణ బృందం(ఎన్​డీఆర్​ఎఫ్​)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

కేంద్రం ఆదేశాలు..

  • మత్య్సకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దు
  • ఇప్పటికే ఉన్న సూచనలు తప్పక అమలు చేయాలి.
  • తీరప్రాంతంతో కచ్చా గృహాల్లో ఉన్న వారిని అవకాశం ఉన్నంత త్వరగా సురక్షిత ప్రదేశానికి తరలించాలి.
  • తుఫాను ప్రభావిత రాష్ట్రాలకు అన్ని విధాల సహకారం అందించాలని అన్ని శాఖలను కోరిన కేబినెట్​ కార్యదర్శి

నవంబర్​ 24 నుంచి మూడ్రోజుల పాటు తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, పుదుచ్చేరిలపైనే తీవ్రంగా ఉండనున్నట్లు హెచ్చరించింది.

హోం, విద్యుత్​, టెలికాం, ఆరోగ్య శాఖ కార్యదర్శులూ సమీక్షలో పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.