ETV Bharat / bharat

'నిరుద్యోగం అంశంలో యువత వెంటే కాంగ్రెస్​' - ఉపాధ్యాయ నియామక పరీక్ష

నిరుద్యోగ సమస్యపై యువతతో వీడియో కాన్ఫరెన్స్​లో సంభాషించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. నిరుద్యోగం తమకు రాజకీయ సమస్య కాదని.. మానవత్వంతో కూడుకున్నదని అన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్​ తన గళాన్ని వినిపిస్తుందని, న్యాయం కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు.

Unemployment issue not political, but humanitarian: Priyanka
'నిరుద్యోగం అంశంలో యువత వెంటే కాంగ్రెస్​'
author img

By

Published : Sep 17, 2020, 5:36 PM IST

రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ సమస్యపై పోరాడతామని స్పష్టం చేశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. ఉత్తర్​ప్రదేశ్​లోని వివిధ జిల్లాలకు చెందిన 50 మంది యువతతో నిరుద్యోగం అంశంపై వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడిన ప్రియాంక.. ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం అంశంలో యువత వెంటే కాంగ్రెస్​ ఉంటుందని హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఉత్తీర్ణులైన యువతీయువకులు ఈ సందర్భంగా.. తమ బాధలను ప్రియాంకకు చెప్పుకున్నారు. 2016లోనే ఉద్యోగానికి ఎంపికైనా.. ఇప్పటివరకు నియామక పత్రం ఇవ్వలేదని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. రెండేళ్లుగా కుంగుబాటుకు లోనయ్యాయని.. తన కుటుంబమూ ఇబ్బందుల్లో ఉందని కన్నీటి పర్యంతమైంది.

ట్యూషన్లు చెప్పి జీవనోపాధి పొందుతుంటే.. కరోనా సంక్షోభం మరింత చిక్కుల్లోకి నెట్టిందని కొందరు వాపోయారు.

'మీకు మేమున్నాం..'

యువత గోడును విన్న ప్రియాంక గాంధీ.. ఈ అంశంలో కాంగ్రెస్​ పూర్తి సాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం.. విద్యార్థుల వాణిని తప్పక వినాల్సిన అవసరం ఉందన్నారు.

Unemployment issue not political, but humanitarian: Priyanka
నిరుద్యోగ సమస్యపై ప్రియాంక గాంధీ ట్వీట్​

నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్​ పోరాటంలో భాగంగా ఈ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించినట్లు పార్టీ మీడియా కన్వీనర్​ లలన్​ కుమార్​ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.