ETV Bharat / bharat

సరిహద్దు చర్చలపై అనిశ్చితి- చైనా కొత్త కుట్ర? - DE Escalation

బలగాల ఉపసంహరణతో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​ చేసిన కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చల ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. చర్చలకు సంబంధించి మరో తేదీని కూడా ప్రకటించలేదని అధికారవర్గాల సమాచారం. సమావేశంపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో చైనా వైఖరిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Uncertainty over next India-China corps commander talks, is Beijing biding for Gen Winter?
సరిహద్దు చర్చలపై అనిశ్చితి.. చైనా కొత్త కుట్ర?
author img

By

Published : Jul 30, 2020, 4:02 PM IST

సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి చైనా నిజంగానే ప్రయత్నిస్తోందా? లేదంటే భారత్​ను దెబ్బతీయడానికి సమయం కోసం ఎదురుచూస్తోందా? చైనాతో జాగ్రత్తగా ఉండాలన్న నిపుణుల మాటలు నిజంకానున్నాయా? వివాదాన్ని పరిష్కరించేందుకు తలపెట్టిన చర్చలను తాజాగా చైనా అడ్డుకోవడం ఈ ప్రశ్నలకు మరింత బలం చేకూరుస్తోంది.

చర్చలపై అనిశ్చితి...

తూర్పు లద్ధాఖ్​లోని సరిహద్దులో బలగాలను ఉపసంహరించుకుని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు గురువారం కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చలకు భారత్​ ప్రతిపాదించినట్టు సమాచారం. పాంగ్యాంగ్​ సరస్సులో నెలకొన్న ప్రతిష్టంభనపై ఈ భేటీలో చర్చలు జరపాలని భావించింది భారత్​. అయితే పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్​ఏ) ఇందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. చర్చల కోసం పీఎల్​ఏ వేరే తేదీని కూడా చెప్పలేదని సైనికవర్గాలు అంటున్నాయి.

వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న భూభాగం చైనాకు అనుకూలంగా ఉంది. మౌలిక వసతులు, లాజిస్టిక్స్​, తూర్పు లద్దాఖ్​లో బీభత్సం సృష్టించే శీతాకాలాన్ని ఎదుర్కొనే పరికరాల పరంగా చైనా ఎంతో మెరుగైన స్థానంలో ఉంది.

ఇప్పటికే కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. చైనాతో వివాదం నేపథ్యంలో సరిహద్దులో భారీ స్థాయిలో బలగాలను మోహరించిన భారత్​కు​.. సైనికుల వసతి, పరికరాల నిర్వహణలో ఆర్థిక భారం ఎదుర్కొనే అవకాశముంది.

ప్రస్తుతం తూర్పు లద్ధాఖ్​లో నాలుగు కీలక ప్రాంతాలున్నాయి. అవి గల్వాన్​ లోయ(పెట్రోలింగ్​ పాయింట్​ 14), పాంగ్యాంగ్​ సరస్సు(ఫింగర్​ 4), హాట్​ స్ప్రింగ్​(పెట్రోలింగ్​ పాయింట్​ 15), గాగ్రా(పెట్రోలింగ్​ పాయింట్​17).

ఫింగర్​ 4లో పాంగ్యాంగ్​ సరస్సు చైనాకు ఎంతో కీలకమైనది. దానితోనే హాట్​ స్ప్రింగ్స్​, గోగ్రా లోయ చైనీయులకు అందుబాటులో ఉంటుంది.

అక్కడే మొదలు...

మే 5న పాంగ్యాంగ్​ సరస్సు వద్ద భారత్​-చైనా జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇప్పటివరకు అవి పూర్తి స్థాయిలో సద్దుమణగలేదు.

సరిహద్దులో శాంతి స్థాపనలో భాగంగా ఫింగర్​ 4 నుంచి వెనుదిరిగి ఫింగర్​ 5 వద్ద పాగా వేసింది పీఎల్​ఏ. కొత్తగా ఆక్రమించుకున్న ప్రాంతం నుంచి వెనక్కిమళ్లడానికి మాత్రం చైనా అంగీకరించడం లేదు.

వాస్తవాధీన రేఖ వెంబడి మొత్తం 8 ఫింగర్​ పాయింట్లు ఉన్నాయి. ఫింగర్​ 8 వరకు తమ ఎల్​ఓసీ ఉందని భారత్​ విశ్వసిస్తుండగా.. ఫింగర్​ 3 వరకు తమ భూభాగమని చైనా వాదిస్తోంది.

--- సంజీవ్ బారువా, సీనియర్​ జర్నలిస్ట్​.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.