సెక్షన్ 124ఏ(దేశద్రోహ చట్టం) రద్దు చేయడం, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని సమీక్షించడం లాంటి కాంగ్రెస్ హామీలు... ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు సహకరించే విధంగా ఉన్నాయని అమిత్ షా ఆరోపించారు. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయడం వల్ల దేశం విచ్ఛిన్నం అవుతుందని హెచ్చరించారు.
వేర్పాటువాదులకు, దేశద్రోహులకే మేలు
వేర్పాటువాదులు, దేశ ద్రోహులకు మాత్రమే సంతోషం కలిగించేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని విమర్శించారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన భాజపా మహిళా కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. మెరుపుదాడులు, వాయుదాడులతో భారత సైన్యం, ప్రధాని నరేంద్ర మోదీ... పాకిస్థాన్ ఉగ్రవాదుల భరతం పడుతుంటే, కాంగ్రెస్ మాత్రం దేశ ద్రోహం తప్పుకాదని మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు సుష్మ.
ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీనే ప్రజలు ఎన్నుకుంటారని తనకు పూర్తి విశ్వాసముందన్నారు సుష్మా స్వరాజ్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రదాడులకు సరైన సమాధానం చెప్పలేకపోయిందని విమర్శించారు.