ETV Bharat / bharat

'పేదలపై దృష్టి సారిస్తేనే భారత్​లో కరోనా కట్టడి సాధ్యం'

భారత్ లో కరోనాను కట్టడి చేసేందుకు పేద ప్రజలపై దృష్టి సారించాలని బ్రిటన్ రాజకీయవేత్త డాక్టర్ నీరజ్ పాటిల్ సూచించారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బ్రిటన్ లో 3 దశల వ్యూహాలను అమలు చేసి కరోనాపై యుద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

NEERAJ PATIL
నీరజ్ పాటిల్
author img

By

Published : Apr 1, 2020, 2:35 PM IST

భారత్​లో కరోనా వైరస్ నియంత్రణకు ప్రాథమిక మార్గం సామాజిక దూరం పాటించడమేనని బ్రిటన్ రాజకీయవేత్త, భారతీయ వైద్యుడు నీరజ్ పాటిల్ పేర్కొన్నారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బ్రిటన్ లో అనేక వ్యూహాలను అనుసరించి కరోనాను కట్టడి చేస్తున్నట్లు వివరించారు.

ఈటీవీ భారత్ తో నీరజ్ పాటిల్

యూకేలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను వెలుగులోకి తెచ్చారు నీరజ్. కరోనాను కట్టడి చేసేందుకు మూడు దశల వ్యూహాన్ని బ్రిటన్ అమలు చేసిందని తెలిపారు.

నీరజ్​ చెప్పిన కీలక విషయాలు:

  • సామాజిక దూరాన్ని పకడ్బందీగా అమలు చేయటం, మహమ్మారిపై స్వీయ అవగాహన పెంచుకోవటం వల్ల బ్రిటన్ భారీ విజయం సాధించింది. చాలా పాజిటివ్ కేసులను కట్టడి చేయగలిగాం.
  • మూడో నివారణ దశకు చేరేసరికి... 70 ఏళ్ల పైబడిన వారు, గర్భిణిలు, హృదయ, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు 5 శాతమే ఉన్నారు. వారికి ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాం.
  • బ్రిటన్ లో వ్యక్తిగత సంరక్షణ పరికరాల కొరత మినహా పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు. కానీ... ఇదే అతిపెద్ద వైఫల్యంగా మారింది.
  • కరోనా బాధితులతో పాటు ఇతర సమస్యలు ఉన్నవారికి వైద్యులు చికిత్స చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి బ్రిటన్ ముందుగానే సిద్ధమైంది.

ఆలస్యంగా స్పందించారు..

కరోనా విషయంలో ప్రపంచం ఆలస్యంగా స్పందించిందని నీరజ్ అభిప్రాయపడ్డారు. చైనాలో మొదటి కేసు నమోదు కాగానే ప్రపంచమంతా అప్రమత్తం కావాల్సిందన్నారు. చైనా నుంచి విమానాలను జనవరిలోనే రద్దు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. సరైన సమయానికి ప్రపంచదేశాలు చర్యలు చేపట్టి ఉంటే కరోనా వ్యాప్తిని నియంత్రించగలిగే వాళ్లమని విశ్లేషించారు.

భారత్​లో...

భారత్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడిన నీరజ్.. సామాజికం దూరాన్ని బలవంతంగానైనా అమలు చేయాలన్నారు. ప్రజలకు కరోనా వైరస్ సంబంధించిన వివరాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

  • మురికివాడల్లో నివసించే ప్రజలు, ప్రాథమిక సదుపాయాలు లేని వారికి ప్రభుత్వం పరీక్షలు చేయాలి. వారి జీవితాలను నిలబెట్టుకోవడానికి తగినంత సాయం అందించాలి.
  • ప్రజలకు అవసరమైన మందులను సరఫరా చేస్తూ వేగంగా కోలుకునేందుకు ఔషధాలను అందించాలి. వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచటం చాలా అవసరం.
  • దేశవ్యాప్తంగా ఇంటెన్సివ్ కేర్ సామర్థ్యాన్ని పెంచాలి.

డాక్టర్ నీరజ్ పాటిల్ భారతీయ వైద్యుడు. ఆయన లండన్ లోని బరో ఆఫ్ లాంబెత్ కు 2010-11 మధ్య కాలంలో మేయర్ గా ఉన్నారు. ఆయన లేబర్ పార్టీ సభ్యుడు. ఆసియా నుంచి బరోకు మేయర్ గా ఎన్నికైన మొదటి వ్యక్తి.

ఇదీ చూడండి: కరోనా సమర వ్యూహంలో.. వలస జీవులకు ఆసరాగా నిలవాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.