జాతీయ అర్హత పరీక్ష(నెట్) మరోసారి వాయిదాపడింది. ఈ నెల 16-25 మధ్య జరగాల్సిన ఈ పరీక్షను 24 నుంచి నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధ్వర్యంలో సెప్టెంబర్ 16, 17, 22, 23 తేదీలలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్) పరీక్షలు జరగనున్నాయి. అదే సమయంలో నెట్ పరీక్ష నిర్వహిస్తే.. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు నష్టపోతారన్న ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది విద్యాశాఖ.
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే పరీక్షలను విడివిడిగా నిర్వహిస్తున్నట్టు చెప్పిన అధికారులు.. త్వరలోనే అధికారికంగా నెట్ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: 'విద్యార్థుల భవిష్యత్తు కోసమే చివరి ఏడాది పరీక్షలు'