ETV Bharat / bharat

అన్ని పరీక్షలు రద్దు- విద్యా సంవత్సరం వాయిదా!

UGC is likely to recommend cancellation of final year exams and semester exams in colleges and universities and further delay the academic calendar
అన్ని పరీక్షలు రద్దు- విద్యా సంవత్సరం వాయిదా!
author img

By

Published : Jun 24, 2020, 6:19 PM IST

Updated : Jun 24, 2020, 6:56 PM IST

18:17 June 24

అన్ని పరీక్షలు రద్దు- విద్యా సంవత్సరం వాయిదా!

అన్ని వర్సిటీలు, కళాశాలల్లో పరీక్షలు రద్దు చేయడానికి యూజీసీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో జరిగే సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌లోనూ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని రకాల సాంకేతిక ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ కూడా మార్చేందుకు మంత్రిత్వశాఖ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.  

మరోవైపు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలపై సుప్రీంకోర్టులో గురువారం.. విచారణ జరగనుంది. పరీక్షల నిర్వహణపై విచారణ జరపనుంది సర్వోన్నత న్యాయస్థానం. ఈ అంశంపై తమ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు సీబీఎస్‌ఈ రేపు వెల్లడించనుంది.

సీబీఎస్‌ఈ నిర్ణయానికి అనుగుణంగా సాంకేతిక విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణపై మానవ వనరుల శాఖ ప్రకటన చేసే అవకాశముంది.

Last Updated : Jun 24, 2020, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.