దేశంలో న్యాయ వ్యవస్థ పట్ల విచారం వ్యక్తం చేశారు రాష్టపతి రామ్ నాథ్ కోవింద్. న్యాయ ప్రక్రియ సామాన్యులకు అందుబాటులో లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
రాజస్థాన్ జోధ్‌పుర్‌లో ఆ రాష్ట్ర హైకోర్టు నూతన భవన ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ఆయన పేదలకు ఉచిత న్యాయ సహాయం అందిచాలని సూచించారు.
"న్యాయ ప్రక్రియ అనేక కారణాల వల్ల ఖరీదైనదిగా మారిపోయింది. ఎంతగా అంటే సాధారణ పౌరులకు అందనంతగా.. ప్రత్యేకించి హైకోర్టు, సుప్రీంకోర్టులలో అది అసాధ్యంగా మారింది.
ఈ రోజు పేద, అణగారిన వారు ఎవరైనా తమ ఫిర్యాదుతో ఇక్కడకు(కోర్టుకు) రాగలరా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది ఎందుకంటే రాజ్యాంగానికి ముందుమాటలో, అందరికీ న్యాయం అందించే బాధ్యతను మనమందరం అంగీకరించాము. మహాత్మ గాంధీ ప్రసిద్ధ ప్రమాణాన్ని మనం గుర్తుంచుకుంటే, పేద, బలహీనుల దీనస్థితిని దృష్టిలో పెట్టుకుంటే మనం సరైన మార్గాన్ని చూస్తాం."
-రామ్‌నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి
సుప్రీం కోర్టు తొమ్మిది ప్రాంతీయ భాషల్లో తీర్పు వెలువరచడం ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి.
ఇదీ చదవండి:నిత్యానందకు షాక్.. పాస్‌పోర్టుకు విదేశాంగశాఖ చెక్