బంగాల్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం.. తూర్పు బర్ధమాన్ జిల్లాలో ఇద్దరు మహిళా టీచర్లను సస్పెండ్ చేసింది. ప్రతికూల దృక్పథాన్ని పెంచేలా ఉన్న పుస్తకాన్ని విద్యార్థులతో చదివించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఆ పుస్తకం యూ అక్షరానికి అగ్లీ(అందవిహీనం) అనే పదం సూచిస్తోంది. దాని పక్కన నలుపు రంగులో ఉన్న ఓ వ్యక్తి బొమ్మ అచ్చు వేసి ఉంది. దీంతో పిల్లల మనసుల్లో నల్లగా ఉన్నవారంతా అందవిహీనంగా ఉంటారని పాతుకుపోయే ప్రమాదం ఉంది.
"ఆ పుస్తకం ఆ రాష్ట్ర విద్యా శాఖ సూచించినది కాదు. అది ఆ పాఠశాల యాజమాన్యమే రూపొందించింది. విద్యార్థుల మనసుల్లో పక్షపాతాన్ని నింపే ప్రయత్నాన్ని ఏ మాత్రం సహించేదిలేదు."
-పార్థా ఛటర్జీ, బంగాల్ విద్యా శాఖ మంత్రి
లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం విద్యాసంస్థలు మూతపడ్డాయి.. దీంతో ఓ విద్యార్థి తండ్రి తన కుమారునికి ఇంట్లో ఆ పుస్తకాన్ని చదివిస్తున్నప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి:పీపీఈ కిట్లే వైద్య సిబ్బందికి శ్రీరామరక్ష