ETV Bharat / bharat

కశ్మీర్​లో ఇద్దరు తీవ్రవాదులు అరెస్ట్ - నర్వాల్ బైపాస్

కర్మీర్​లో ఇద్దరు తీవ్రవాదుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు చురాత్​కి చెందిన రాయిస్ అహ్మద్ దర్, ఆష్ముజీకి చెందిన సుబ్జార్ అహ్మద్ షేక్​గా గుర్తించారు. వీరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Two TRF terrorists arrested in Jammu; arms, ammunition seized
కశ్మీర్​లో ఇద్దరు తీవ్రవాదుల అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
author img

By

Published : Dec 26, 2020, 11:16 AM IST

కశ్మీర్​లోని నర్వాల్​ బైపాస్​ వద్ద పోలీసులు ఇద్దరు తీవ్రవాదుల్ని శుక్రవారం అరెస్టు చేశారు. తీవ్రవాదుల కదలికలపై వచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక చెక్​ పాయింట్ ఏర్పాటు చేశామని.. ఈ క్రమంలోనే వారిని పట్టుకున్నామని తెలిపారు. నిందితులు చురాత్​కి చెందిన రాయిస్ అహ్మద్ దర్, ఆష్ముజీకి చెందిన సుబ్జార్ అహ్మద్ షేక్​గా గుర్తించారు.

"శుక్రవారం సాయంత్రం 5.30కి ప్రత్యేక బృందం ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. కారులో వచ్చిన నిందితులు చెక్​ పాయింట్​ నుంచి తప్పించుకోవడానికి యత్నించారు. అప్రమత్తమైన ప్రత్యేక బృందం వారిని వెంబడించి పట్టుకుంది. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాగులో ఓ ఏకే రైఫెల్ , పిస్టోల్ సహా వాటి మ్యాగెజీన్లు లభ్యమైయ్యాయి."

-పోలీసులు

Two TRF terrorists arrested in Jammu; arms, ammunition seized
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

తీవ్రవాద కార్యకలాపాల్లో అనుభవం ఉన్న దర్​పైన ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతను ది రెసిస్టెన్స్​ ఫోర్స్ (టీఆర్​ఎఫ్)కు పనిచేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. అతనితో పాటు వచ్చిన మరో వ్యక్తి గురించి కూడా దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. టీఆర్​ఎఫ్​ పేరుతో కార్యకలాపాలు జరుపుతున్న ఈ సంస్థకు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని సమాచారం.

ఇదీ చదవండి : హఫీజ్ సయీద్​కు మరో భారీ షాక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.